![Vijay Deverakonda Launches Nuvvu Thopu raa Teaser - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/12/vijay.jpg.webp?itok=DL5Y074N)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన అభిమానులను రౌడీస్ అంటూ సంబోధిస్తుంటారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన విజయ్.. చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
‘నువ్వు తోపు రా’ మూవీ టీజర్‌ను విజయ్ చేతులమీదుగా రిలీజ్ చేయించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నాటి హీరోయిన్ నిరోష చాలాకాలం తరువాత నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను జూలై 14న విడుదల చేయనున్నారు. సుధాకర్, నిత్యా శెట్టిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment