
ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం నిర్మాణ కార్యక్రయాలను శరవేగంగా జరుపుకుంటోంది. మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మంచి కథాంశంతో కూడిన చిత్రాలను అందించండి అంటున్నారు క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత, నటుడు వీ.సత్యమూర్తి. ఈయన తాజాగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు. యూట్యూబ్ చిత్రం ఎరుమాసాని ఫేమ్ రమేశ్ వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అదే విధంగా యూట్యూబ్‌లో సందడి చేస్తున్న మెడ్రాస్ సెంట్రల్ ఫేమ్ గోపి, సుధాకర్, ఎరుమసాని ఫేమ్ విజయ్, హరిజా, పుట్ చట్నీ ఫేమ్ అగస్థ్యన్, టెంపుల్ మంకీస్ ఫేమ్ షారా, అబ్దుల్, బిహెండ్‌వుడ్స్ ఫేమ్ వీజే.ఆశిక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రం గురించి నిర్మాత, నటుడు వీ.సత్యమూర్తి తెలుపుతూ షూటింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పటికీ, దర్శకుడు 45 రోజుల్లోనే పూర్తి చేశారని, ఆయన ప్లానింగ్, నటీనటులు, సాంకేతిక వర్గం సహకారమే ఇందుకు కారణమన్నారు.
దర్శకుడితో సహా పలువురు నటీనటులు, సాంకేతిక వర్గం యూట్యూబ్ చిత్రాల నుంచి వెండితెరకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న వారేనని తెలిపారు. ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న జనరంజక చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి జోశ్వా జే.పెరోజ్ ఛాయగ్రహణ, కౌశిక్ గిరీశ్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మెలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వీ.సత్యమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment