చిన్నారిపై అత్యాచారయత్నం | molest on 5 year old Child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై అత్యాచారయత్నం

Published Sun, Jan 3 2016 10:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

molest on 5 year old Child

అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడో కామాంధుడు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన సుధాకర్(30) ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. బాలిక కేకలు వేసింది. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమై నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement