
ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 18 వ అంతస్తులో ఉన్న ఆ పిల్లాడు గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచాడు. అదే అతనికి అంతిమ ఘడియగా మారింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాత్రి 8 గంటల సమయంలో..
నోయిడా ఎక్స్‌టెన్షన్ అంటే గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బిస్రఖ్ ప్రాంతానికి చెందిన డివైన్ సొసైటీలో రాత్రి 8 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి పడిపోయిన 7వ క్లాస్లు కుర్రాడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ 12 ఏళ్ల బాలుడు అదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచేందుకు 18 వ ఫ్లోరు బాల్కనీలో నుంచి తొంగిచూస్తూ కిందపడిపోయాడు.
తండ్రి ఏదోపనిమీద బయటకు వెళ్లగా..
ఈ ఉదంతం గురించి స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో బాల్కనీలో ఆ బాలుడు ఒక్కడే ఉన్నాడని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ ఇంటిలో లేరన్నారు. ఆ బాలుని తండ్రి ఏదోపనిమీద బయటకు వెళ్లగా, తల్లి గ్రౌండ్ ఏరియాలో ఉన్నదన్నారు. ఈ సమయంలో బాలుడు కిందినున్న తల్లిని పిలిచేందుకు బాల్కనీలో నుంచి తొంగిచూశాడని, పట్టుతప్పి కిందపడిపోయాడన్నారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
గత నెలలో పార్క్ సొసైటీలో..
పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడకు వచ్చి ఉంటోంది. మృతుని తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాల నుంచి జారిపడి మృతిచెందిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. గత నెలలో పార్క్ సొసైటీలోని 8వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలుడు కిందపడి మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..
Comments
Please login to add a commentAdd a comment