ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక పిల్లవాడు తనకు తల్లిపై గల ప్రేమను చాటిన తీరు అందరినీ విస్మయపరుస్తోంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాన్న.. అమ్మను కొడుతుండటాన్ని సహించలేని ఆ పిల్లాడు తన స్థాయికి మించిన పని చేసి, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఆగ్రా పోలీసులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ.. ఆ పసివాడు తన తండ్రి హరిఓం(40) తన తల్లిని ఇనుప రాడ్డు, బెల్టుతో కొట్టడాన్ని చూశాడన్నారు. తరువాత ఆ పిల్లాడు బసోనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఉదంతం జెబ్రా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసు అదికారి వీరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ పిల్లాడు బయటనే కూర్చున్నాడన్నారు. కొద్దిసేపటి తరువాత తన దగ్గరకు వచ్చి, తండ్రి హరిఓం తన తల్లిని బెల్టుతో, ఇనుప రాడ్డుతో కొట్టాడని ఫిర్యాదు చేశాడు. మద్యం తాగి వచ్చిన తన తండ్రి తన తల్లిని ఇదేవిధంగా కొడుతుంటాడని’ ఆ పిల్లాడు చెప్పాడన్నారు.
హరిఓం ఆగ్రాలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా ఆ పిల్లాడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఒక టీమ్‌ను వారి ఇంటికి పంపించారు. వారు అక్కడున్న హరిఓంను అరెస్టు చేశారు. తరువాత విడిచి పెట్టేశారు. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ తన భర్త తనను ఇకపై ఎప్పుడూ కొట్టబోనని ప్రమాణం చేశాడని, ఈ విషయం పోలీసులకు తెలియజేశాక పోలీసులు తన భర్తను విడిచిపెట్టేశారని తెలిపారు.
3 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి..
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ 12 ఏళ్ల పిల్లాడు 3 కిలోమీటర్ల దూరం ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ పిల్లాడు తన తల్లిని.. తండ్రి ఏ విధంగా హింసిస్తున్నాడో వివరంగా తెలియజేశాడన్నారు.
ఇది కూడా చదవండి: వీడియో: పోలీసాయన మంచి మనసు.. కారు బంపర్‌లో ఇరుక్కుపోతే..
Comments
Please login to add a commentAdd a comment