Complain
-
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన!
యూపీలోని కాన్పూర్‌లో 105 ఏళ్ల వృద్ధుడు నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని, తన గోడు వెళ్లబోసుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధుడిని చూసిన ఏడీసీపీ అశోక్ కుమార్ ముందుగా ఆతనికి చల్లని నీరు అందించారు. తరువాత అతని బాధేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, ఆ వృద్దుని తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కాన్పూర్‌కు చెందిన రాజ్ బహదూర్ అనే వృద్ధుని గోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో.. చేతికర్ర సాయంతో అతను నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతనిని చూసిన పోలీస్ కమిషనర్ స్టాఫ్ ఆఫీసర్(ఏడీసీపీ) అశోక్ కుమార్ అతని దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తనను గ్రామానికి చెందిన ఉత్తమ్ కుమార్ అనే యువకుడు వేధిస్తున్నాడని, కొడుతున్నాడని ఆ వృద్దుడు ఫిర్యాదు చేశాడు. తాను ఆంగ్లేయుల పరిపాలనా కాలాన్ని చూశానని, అప్పట్లో తన వయసు 12 ఏళ్లు ఉంటుందని తెలిపాడు. వృద్దుని గోడు విన్న ఏడీసీపీ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? -
ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..
ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్లో నాన్‌వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. హాస్టల్లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు. ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!
బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్ఎక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్వుడ్ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు. పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్ తెలిపారు. ఇది కూడా చదవండి: టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం! -
అమ్మను కాపాడేందుకు.. 12 ఏళ్ల పిల్లాడి సాహసం!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక పిల్లవాడు తనకు తల్లిపై గల ప్రేమను చాటిన తీరు అందరినీ విస్మయపరుస్తోంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాన్న.. అమ్మను కొడుతుండటాన్ని సహించలేని ఆ పిల్లాడు తన స్థాయికి మించిన పని చేసి, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆగ్రా పోలీసులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ.. ఆ పసివాడు తన తండ్రి హరిఓం(40) తన తల్లిని ఇనుప రాడ్డు, బెల్టుతో కొట్టడాన్ని చూశాడన్నారు. తరువాత ఆ పిల్లాడు బసోనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఉదంతం జెబ్రా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసు అదికారి వీరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ పిల్లాడు బయటనే కూర్చున్నాడన్నారు. కొద్దిసేపటి తరువాత తన దగ్గరకు వచ్చి, తండ్రి హరిఓం తన తల్లిని బెల్టుతో, ఇనుప రాడ్డుతో కొట్టాడని ఫిర్యాదు చేశాడు. మద్యం తాగి వచ్చిన తన తండ్రి తన తల్లిని ఇదేవిధంగా కొడుతుంటాడని’ ఆ పిల్లాడు చెప్పాడన్నారు. హరిఓం ఆగ్రాలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా ఆ పిల్లాడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఒక టీమ్‌ను వారి ఇంటికి పంపించారు. వారు అక్కడున్న హరిఓంను అరెస్టు చేశారు. తరువాత విడిచి పెట్టేశారు. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ తన భర్త తనను ఇకపై ఎప్పుడూ కొట్టబోనని ప్రమాణం చేశాడని, ఈ విషయం పోలీసులకు తెలియజేశాక పోలీసులు తన భర్తను విడిచిపెట్టేశారని తెలిపారు. 3 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి.. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ 12 ఏళ్ల పిల్లాడు 3 కిలోమీటర్ల దూరం ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ పిల్లాడు తన తల్లిని.. తండ్రి ఏ విధంగా హింసిస్తున్నాడో వివరంగా తెలియజేశాడన్నారు. ఇది కూడా చదవండి: వీడియో: పోలీసాయన మంచి మనసు.. కారు బంపర్‌లో ఇరుక్కుపోతే.. -
సమస్యలుంటే నాకు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా ఉండేందుకు జనం నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలపై వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు దాతల సాయం తీసుకుంటామన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుంటానని, వారి సమస్యలను వినడంతో పాటు అర్జీలను స్వీకరించి ప్రభుత్వ శాఖల సహకా రంతో పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ గతం లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఏర్పా ట్లను సైతం గతంలో చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారంలో పురోగతిని సమీక్షించడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. కరోనా వ్యాప్తితో అప్పట్లో ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించలేకపోయారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాదర్బార్‌కు బదులు డ్రాప్ బాక్స్ (ఫిర్యాదుల పెట్టె్ట) ద్వారా సామాన్య ప్రజల నుంచి విన్నపాలు, సలహాలు గవర్నర్ స్వీకరించనున్నారు. రాజ్‌భవన్ బయట ప్రవేశ ద్వారం వద్ద డ్రాప్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించడంతో పాటు వాటి పరిష్కారానికి రాజ్‌భవన్ కృషిచేస్తుందని వెల్లడించారు. రాజ్‌భవన్ పరివార్ సభ్యుల కోసం... రాజ్‌భవన్ పరివార్ సభ్యుల నుంచి అర్జీలను స్వీక రించేందుకు లోపల మరో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శని వారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో ఆమె ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సేవా ఇంటర్నేషనల్ సంస్థ ఈ ల్యాప్‌టాప్ లను విరాళంగా అందజేసింది. అనంతరం డ్రాప్ బాక్స్‌లను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 100 శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసు కోవాలని ప్రజలకు సూచించారు. పాశ్చాత్య ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ ఆహారాన్ని స్వీకరించాలని కోరారు. -
భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధం
-
నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఒకరిని.. ఇద్దరిని కాదు ఏకంగా నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వారిని నట్టేటముంచాడు. మాయమాటలతో బురిడీకొట్టి నలుగురిని బుట్టలో వేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం.. కాస్త నాలుగో భార్యతో పెట్టుకున్న వివాదంతో బట్టబయలైంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసింహనగర్‌కు చెందిన జన్న అరుణ్‌కుమార్ న్యూగరుడా ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఈయన తన భార్య చనిపోయిందని చెప్పి శివాజీపాలేనికి చెందిన శ్యామలను 2015లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించింది. వాహనం కొనుగోలు కోసం డబ్బులు కావాలని చెప్పి శ్యామల వద్ద రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తరచూ గొడవ పడుతూ ఆమెను దూరం చేయడం మొదలు పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన శ్యామల.. అరుణకుమార్ గురించి ఆరా తీసింది. తనకంటే ముందు మరో ముగ్గురు మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలుసుకుని షాక్‌కు గురైంది. మొదటి భార్యకు ఒక సంతానం కూడా ఉంది. రెండో భార్య చనిపోయింది. మూడో భార్యకు పాప ఉంది. తనను నాలుగో పెళ్లి చేసుకుని నట్టేట ముంచాడని శ్యామల భోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించి, మహిళల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరుతోంది. ఈ కేసు మహిళా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మహిళా పోలీసులకు శ్యామల ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
సినిమా యూనిట్‌పై కేసు నమోదు
నేరేడ్మెట్: సినీ నటి, నిర్మాత, దర్శకుడిపై నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైనట్లు బీజేపీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న తెలిపారు. ఫిర్యాదుదారుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..విడుదలకు సిద్దంగా ఉన్న ‘సీతా ఆయాం నాట్ ఏ వర్జిన్’ సినిమా టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ గత శుక్రవారం బీజేపీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్ పెట్టారని ఈమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హీరోయిన్ దీప్తీ సునయన, నిర్మాత నీరజ్నాయుడు, దర్శకుడు కైషిక్బాబుల పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రయాణికులకు షాకిచ్చిన భారీ నౌక
ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' లో తొలిసారి ప్రయాణించాలన్న కోరికతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎక్కడెక్కినుంచో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఇంకాపూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవకుండానే తమకు టికెట్లు అమ్మి యాజమాన్యం సోమ్ము చేసుకుందని అందులో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాయిలెట్లు జామ్ అయిపోయి దుర్వాసన వస్తుందని.. ఓ ప్రయాణికుడు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఫోటోను ట్విట్ చేశాడు. తన కొత్త డ్రెస్‌కు నౌకకు వేసిన పెయింట్ అంటుకుందని మరో ప్రయాణికుడు తెలిపారు. నౌకలో ఇంకా రిపేర్ పనులు చేస్తుండటంతో శబ్ధాలకు చిర్రెత్తుకొస్తోందంటూ మరొకరు. కొన్ని చోట్ల నీరు లీక్ అవ్వడంతో బయటకు వచ్చి చేరిందంటూ హర్మనీ ఆఫ్ ది సీస్ తొలి ప్రాయణికులు తమ ఛేదు అనుభవాలను తెలిపారు.. ఇంకా నౌకలోని కొన్ని చోట్ల పనులు పూర్తవకపోడంతో వాటిని మూసివేసి పనులు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు చాలా మంది ఒక చోట చేరి ఇంకా పూర్తి కాని నౌక టికెట్లు ఎలా అమ్ముకుంటారని ధ్వజమెత్తారు. మా టికెట్ల డబ్బు తిరిగి ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లమంటూ తమ నిరసన తెలిపారు. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హాలిడే ను ఆస్వాదించాలని వచ్చిన ఓ వ్యక్తి తాను పోచ్డ్ ఎగ్స్ ఆర్డర్ చేస్తే వాళ్లు మరోటి తీసుకు వచ్చారు అంటూ ఫోటోను ట్విట్ చేశారు. -
సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్!