ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్‌లో నాన్‌వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్‌లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు.
హాస్టల్‌లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు.
ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్‌సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు.
Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi
— APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023
తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్‌వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్‌లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment