బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్‌ఎక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్‌వుడ్ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్‌వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు.
పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్ తెలిపారు.
ఇది కూడా చదవండి: టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం!
Comments
Please login to add a commentAdd a comment