మహిళా డీఎస్పీపై ఆందోళనకారుల దాడి.. జుట్టు పట్టుకొని లాగి | Video: Woman Cop Assaulted, Her Hair Pulled By Protesters In Tamil Nadu | Sakshi
Sakshi News home page

మహిళా డీఎస్పీపై ఆందోళనకారుల దాడి.. జుట్టు పట్టుకొని లాగి

Published Wed, Sep 4 2024 1:52 PM | Last Updated on Wed, Sep 4 2024 3:04 PM

Video: Woman Cop Assaulted, Her Hair Pulled By Protesters In Tamil Nadu

చెన్నై: విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై కొందరు నిరసన కారులు దాడి చేశారు. ఏకంగా డీఎస్పీ స్థాయి  అధికారిణి జుట్టు పట్టుకొని లాగి కొట్టడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకింది. మహిళా అధికారిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని విరుద్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 

వివరాలు..  రామనాథపురానికి చెందిన  35 ఏళ్ల ట్రక్‌ డ్రైవర్‌ కాళికుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో హతమార్చారు. తిరుచ్చూరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కాగా నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం హతుడి బంధువులు, కుటుంబీకులు తిరుచ్చూరికి చేరుకుని అందోళనకు దిగారు. అరుప్పుకోట్టై మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరిని బుజ్జగించేందుకు డీఎస్పీ గాయత్రి అక్కడకు వచ్చారు.

క్రమంలో నిరసన చేస్తున్న వారిలో కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారు. డీఎస్సీ జుట్టు పట్టుకుని లాగి కొట్టడంతో మిగిలిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భౌతిక వాగ్వాదం జరిగింది.

అయితే తన మీద దాడి చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన డీఎస్సీ ఆందోళనకారులను స్వయంగా బుజ్జగించారు. నిందితులను నలుగురిని అరెస్టు చేశామని సూచించడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. కాగా డీఎస్పీ గాయత్రి సంయమనం, పని తీరును స్థానికులు ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement