
సినిమా యూనిట్‌పై కేసు నమోదు
సినీ నటి, నిర్మాత, దర్శకుడిపై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైనట్లు బీజేపీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్
నేరేడ్‌మెట్: సినీ నటి, నిర్మాత, దర్శకుడిపై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైనట్లు బీజేపీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న తెలిపారు. ఫిర్యాదుదారుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..విడుదలకు సిద్దంగా ఉన్న ‘సీతా ఆయాం నాట్ ఏ వర్జిన్’ సినిమా టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ గత శుక్రవారం బీజేపీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్ పెట్టారని ఈమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హీరోయిన్ దీప్తీ సునయన, నిర్మాత నీరజ్‌నాయుడు, దర్శకుడు కైషిక్‌బాబుల పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.