రాజకీయాల్లోకి రాను
సినీ హీరో నారా రోహిత్
కడప కల్చరల్ : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని, ఆ విష యం పెదనాన్న (చంద్రబాబునాయుడు) చూసుకుంటారని, అవసరమనిపిస్తే పార్టీకి సేవలందిస్తానని సినీ హీరో నారా రోహిత్ తెలిపారు. ఆయన నటించిన ‘అసుర’ చిత్రం విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా శుక్రవారం ఆయన కడప నగరంలో హల్‌చల్ చేశారు. తొలుత పెద్దదర్గాను దర్శించుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని చిష్టివుల్ ఖాద్రి సాహెబ్‌ను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తన ‘శంకర’ చిత్రం విడుదల కానుందన్నారు. అనంతరం శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో పూజలు చేశారు.
ప్రేక్షకులతో...
నారా రోహిత్ కడప లో తను నటించిన ‘అసుర’ చిత్రం ప్రదర్శిస్తున్న రవి ధియేటర్‌కు వెళ్లారు. తన సినిమాకు విజయం చేకూర్చిన అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల కోరికపై అసుర చిత్రంలోని ఒక డైలాగ్ చెప్పారు. అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమీర్‌బాబు, గోవర్థన్‌రెడ్డి, నాసర్‌అలీ, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నారా రోహిత్‌కు స్వాగతం
భువనగిరిపల్లె (రాజంపేట రూరల్) : నారా రోహిత్‌కు భువనగిరిపల్లె ఆర్చ్ వద్ద బీజెపీ నాయకుడు నాగోతు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో గురువారం స్వాగతం పలికారు. బీజెపీ, టీడీపీ, ఏబీవీపీ అభిమానులు సత్కరించారు.