పెన్సిల్వేనియాకు చెందిన 5 ఏళ్ల బాలుడిని అతని పెంపుడు తల్లి, ఆమె భర్త చిత్రహింసలకు గురిచేసి చంపేశారని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో చెప్పడంతో పోలీసులు ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బాలుని హత్య గత ఫిబ్రవరిలో జరిగింది. డెల్మాంట్‌కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టిలు గత ఫిబ్రవరి 7న చిన్నారి లాండన్ మలోబెర్టిని అత్యంత కరాతకంగా హత్యచేశారని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించారు.
తల్లిదండ్రుల చేతుల్లో చిత్రహింసకు గురై..
లాండన్‌కు తల, మెడపై తీవ్రమైన గాయాలున్నాయని, బాలుని మొండెంపై కూడా గాయాలున్నాయని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాగా జనవరి 30న గాయాలపాలై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న చిన్నారిని ఆ దంపతులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. జిక్కారెల్లి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం తల్లిండ్రుల చిత్రహింసలకు గురైన ఆ చిన్నారి ఒక వారం రోజుల తర్వాత మరణించాడు. అతనిని దత్తత తీసుకున్న కుటుంబం చేతిలోనే ఆ బాలుడు విలవిలలాడిపోయి చివరికి కన్నుమూశాడు.
అంత్యక్రియల ఖర్చుల పేరుతో..
అయితే ఆ బాలుని తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా నిధులను సేకరించారు. పిల్లవాడి అంత్యక్రియల ఖర్చుల కోసం $5,000లకుపైగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు బృంద తెలిపింది. యూపీఎంసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఐదేళ్ల చిన్నారికి మెదడులో రక్తస్రావం జరిగింది. ఆ బాలుని తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక రోజంతా వేచి చూశారు. పిల్లవాడి శరీరంపై గతంలో అయిన గాయాలు, క్తొతగా అయిన గాయాలు ఉన్నాయని, ఇవి శారీరక వేధింపుల కారణంగా అయిన గాయాలేనని వైద్యులు చెప్పారు.
ఇది కూడా చదవండి: కెనడా మానవ అక్రమ రవాణా కేసులో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష..
దుర్భర స్థితిలో..
బాలునికి గాయాలు సంభవించిన సమయంలో విపరీతమైన నొప్పిని అనుభవించాడని వైద్యులు తెలిపారు. ఆ బాలుడు కనీసం నిలబడలేకపోయాడని, తినడానికి, తాగడానికి వీలుకాని పరిస్థితిలో దుర్భర స్థితిని ఎదుర్కొన్నాడని వారు పేర్కొన్నారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో అతని అవయవాల పనితీరు మరింతగా బలహీనపడిందని వైద్యులు తెలిపారు. కాగా లాండన్‌కు బొమ్మ రాక్షసునితో, ట్రక్కులతో ఆడుకోవడం, దేశీయ సంగీతాన్ని పాడడం అంటే ఎంతో ఇష్టం. అయితే అతని పెంపుడు తండ్రి లారెన్ తన కుమారుని విషయంలో విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించాడు. లాండన్ తోబుట్టువులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తమ తండ్రి.. లాండన్‌ను చెక్క గరిటతో కొట్టడం లేదా స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేయడం ద్వారా అతనిని ఏడ్పించేవారని తెలిపారు.
బాలునిపై విపరీతమైన ద్వేషం
అయితే లాండన్ పాఠం నేర్చుకోకపోవడం కారణంగానే అతని తల్లి లాండన్‌ను దండించేదని తోటి పిల్లలు తెలిపారు. లాండన్ తల్లి సహోద్యోగులు మాట్లాడుతూ ఆమె తన కొడుకుపై ద్వేషం పెంచుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 2022 నుండి బాలుడు చనిపోయే వరకు దంపతుల మధ్య నడిచిన సందేశాలు గమనిస్తే వారు లాండన్ విషయంలో విపరీతమైన ద్వేషం చూపారని దర్యాప్తు బృందం సభ్యులు కనుగొన్నారు. లాండన్ తల్లి లారెన్ ఒకసారి తాను కుమారుడిని చంపబోతున్నాను అని అని టెక్స్ట్ చేసింది. కాగా తన 25 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని డెల్మాంట్ పోలీస్ చీఫ్ టిజె క్లోబుకర్ పేర్కొన్నారు. లాండన్ తల్లిపై హత్య కేసుతో పాటు పిల్లల సంక్షేమానికి అపాయం కలిగించడం, వారిపై దాడి చేయడం, నేరపూరిత కుట్ర మొదలైన నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నిస్పక్షపాతంగా విచారణ
ఆమె భర్త కూడా ఇదేవిధమైన నేరాలకు పాల్పడ్డాడంటూ అతనిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు వీరిద్దరికీ బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం వీరు వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ జైలులో ఉన్నారు. ఆగస్టు 8న కోర్టులో తదుపరి విచారణకు వీరు హాజరుకానున్నారు. లాండన్ తన స్వల్ప జీవితంలోనే తీవ్రమైన గాయాలను చవిచూశాడని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి అన్నారు. లాండన్‌కు తగిన గౌరవాన్ని కల్పిస్తూ, కేసును నిస్పక్షపాతంగా విచారించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: దారుణం: మూడు రోజులపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని.. మహిళ గొంతు పోయేలా అరిచినా..
ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు?
Published Wed, Aug 2 2023 8:27 AM | Last Updated on Wed, Aug 2 2023 9:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment