ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సు తనపై ఓ సీనియర్ క్లర్క్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఠాణే :గోవిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సు తనపై ఓ సీనియర్ క్లర్క్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీహెచ్‌సీ విభాగంలో క్లర్క్‌గా పనిచేస్తున్న నిందితుడు మోహన్ దౌడ్ తరచూ నర్సుల సెక్షన్‌లోకి వెళ్లి ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడు.శుక్రవారం సాయంత్రం వేధింపులు తీవ్రం కావడంతో భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కల్యాణ్ తాలూకా పోలీస్‌స్టేషన్ అధికారి ఏపీఐ వీఆర్ అండాలే పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యలో నిందితుడి లైంగిక వేధింపులు తీవ్రమయ్యాయని బాధితారాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.