
సాక్షి,బంజారాహిల్స్: నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించడంతో పాటు యువతి పరువుకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఫిలింనగర్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేయడంతో పాటు ఫొటోను పెట్టి అసభ్యకరమైన సందేశాలు పెడుతున్నట్లు గుర్తించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment