
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: నర్సుని రూమ్‌లో బంధించి అత్యాచారం చేసిన యువకుడ్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బాధితురాలికి 2012 లో వివాహం జరిగింది. ఆమెకు 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని కారణాలవల్ల భర్తకు విడాకులు ఇచ్చి.. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో హిల్ మై ఫ్యామిలీ హోమ్‌కేర్ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది. సంస్థ తరపున రోగుల కేరింగ్ కోసం వెళ్తుంటుంది.
సంస్థ నిర్వాహకుడు నాగోల్‌కు చెందిన మల్లెల సాయి (28) నవంబర్ 7వ తేదీ సాయంత్రం బాధితురాలికి ఫోన్ చేసి విజయవాడలో ఓ పేషెంట్ కేర్‌కు హాజరుకావడానికి అత్యవసరంగా కార్యాలయానికి రావాలని ఆదేశించాడు. బాధితురాలు ఆఫీస్‌కు వెల్లగానే మేడమీద ఉన్న తన గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడు.
చదవండి: (హైదరాబాద్‌లో దారుణం.. భార్య తలనరికి పోలీస్ స్టేషన్‌కు..)
జరిగిన విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి అదే రోజు ఎంజీబీఎస్ బస్‌స్టాండ్‌లో విజయవాడ బస్సు ఎక్కించాడు. గత కొద్దిరోజులుగా బాధితురాలు రక్తస్రావంతో బాధపడుతుండడంతో.. నగరానికి చేరుకుని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మల్లెల సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment