435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | Notification for filling 435 posts of Civil Assistant Surgeon | Sakshi
Sakshi News home page

435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Sat, Jun 29 2024 6:07 AM | Last Updated on Sat, Jun 29 2024 6:07 AM

Notification for filling 435 posts of Civil Assistant Surgeon

ఎంబీబీఎస్‌ అర్హతతో భర్తీ చేయబోయే పోస్టులు ఇవి.. 

ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి అర్హులు కాదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టీకరణ 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 351 పోస్టులు 

వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

పాయింట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ అర్హతతో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సరీ్వసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. మొత్తం పోస్టులు 435 కాగా, అందులో 351 ప్రాథమికఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, మరో 80 పోస్టులు డీఎంఈ పరిధిలో ఆస్పత్రుల్లో ఆర్‌ఎంఓ పోస్టులు. ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు నాలుగు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. బోర్డు వెబ్‌సైట్‌( https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో తేదీన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అదే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ.58,850 నుంచి రూ.1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధితశాఖ నుంచి ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు.

అంటే ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80 శాతంగా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసిన అభ్యర్థులకు సంబంధించి, ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ పరీక్ష (ఎఫ్‌ఎంజీఈ)లో పొందిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకొని 80 శాతంగా మార్చుతారు. కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. 

గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పనిచేస్తున్నట్టు అనుభవ ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధ్రువ పత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇతర ముఖ్యాంశాలు... 
» ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు సాఫ్ట్‌కాపీని దగ్గర ఉంచుకోవాలి.  
»  ఆధార్‌ కార్డు, పదోతరగతి సర్టిఫికెట్‌ (పుట్టిన తేదీ రుజువుకు), ఎంబీబీఎస్‌ సమగ్ర మార్కుల మెమో, సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రిజి్రస్టేషన్‌ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు, స్థానికతను తెలియజేసే స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి), ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీల విషయంలో నాన్‌–క్రీమిలేయర్‌ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోరేవారు తాజా ఆదాయ, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్‌ కేటగిరీ వారు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికులు వయస్సు సడలింపునకు సరీ్వస్‌ సర్టిఫికెట్, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌ కోసం సర్వీస్‌ సర్టిఫికోట్‌ అప్‌లోడ్‌ చేయాలి.  
»   నోటిఫికేషన్‌ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో, ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే (అర్హతకు సమానమైనవి) వాటిని ’నిపుణుల కమిటీ’కి సిఫార్సు చేస్తారు. నిపుణులకమిటీ’ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది.
»  తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దర ఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్లకు అర్హులు కారు. 
» పోస్టులను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. 
» మల్టీ జోన్‌–1లో జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసి­ల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్‌.  
»   మల్టీ జోన్‌–2 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగాం, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement