సాక్షి, అమరావతి: రామోజీరావుకు, ఆయన విష పత్రిక ఈనాడుకు ఒకటే ఏకసూత్ర ఎజెండా. తమకు నచ్చినవారిని నెత్తిన ఎక్కించుకోవడం.. నచ్చనివారిపై అదేపనిగా విషం కక్కడం. అందులోనూ పేద, బడుగు, బలహీనవర్గాల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రామోజీ కాలకూట విషం చిమ్ముతున్నారు.
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) నెలకు 15 శాతం వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం పీహెచ్‌సీలు 24/7 పనిచేస్తున్నాయని ప్రశంసలు కురిí³ంచింది. అయితే రామోజీకి ఇవేమీ కనిపించవు.. ఎందుకంటే ఆయన ‘లెక్కలు’ వేరే.
ఆ లెక్కలు తన ముద్దుల చంద్రబాబుకు ఉపయోగపడాలి. అంతే.. ఇందుకోసం వాస్తవాలకు పాతరేసి అవాస్తవాలను అడ్డంగా ఈనాడులో అచ్చేస్తారు.. దుష్ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోతారు. ఇందులో భాగంగానే మంగళవారం ఈనాడులో ‘ప్రసవ వేదన’ అంటూ అవాస్తవాలు, అభూత కల్పనలతో ఒక కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించి వాస్తవాలు ఇవిగో..
13 నుంచి 15 శాతం ప్రసవాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి పీహెచ్ïÜలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు కలిపి 14 మందిని నియమించింది. దీంతో పీహెచ్‌సీల వైద్య సేవలు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆ వైద్యుడు సెలవు పెట్టినా.. విధులకు గైర్హాజరయినా ఇక రోగులు చుక్కలు చూడాల్సిందే.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పీహెచ్‌సీల్లో ప్రస్తుతం సగటున నెలకు 13 నుంచి 15 శాతం ప్రసవాలు నిర్వహిస్తున్నారు. 2021–22లో 12.98%, 2022–23లో 13.05% ప్రసవాలు జరిగాయి. వాస్తవాలు ఇలా ఉంటే రామోజీ మాత్రం పీహెచ్‌సీల్లో కేవలం 2.5% ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయనిదుర్మార్గపు రాతలకు తెగబడ్డారు.
మాతృ మరణాల కట్టడే లక్ష్యంగా..
ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైరిస్క్ గర్భిణులకు సురక్షిత ప్రసవాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని గతేడాది డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీల వారీగా హైరిస్క్ గర్భిణులను ముందే గుర్తించి వారిని ప్రసవ తేదీకి ముందే పెద్దాస్పత్రులకు తరలించి సురక్షిత ప్రసవాలు చేపడుతున్నారు. ఇలా హైరిస్క్ గర్భిణులు 22,825, అధిక రక్తహీతన సమస్యతో బాధపడుతున్న 1,584 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
చిన్న చిన్న సమస్యలకే పెద్దాస్పత్రులకు పీహెచ్‌సీల నుంచి గర్భిణులను రిఫర్ చేస్తున్నారని ‘ఈనాడు’ అవాస్తవాలను పేర్కొంది. వాస్తవానికి గర్భిణికి అధిక రక్తపోటు, మధుమేహం ఉండటం, బిడ్డ అడ్డం తిరగడం, బిడ్డ గుండె చప్పుడు అధికంగా/ తక్కువగా ఉన్న ఘటనల్లోనే పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా రిఫర్ చేసిన వారిని వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు.
సాధారణ ప్రసవాలు పెంచడానికి, మాతృ మరణాల నియంత్రణకు మిడ్ వైఫరీ శిక్షణను ప్రారంభించి 60 మంది స్టాఫ్ నర్సులకు 18 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అలాగే 4,388 మంది స్టాఫ్ నర్సులు, వైద్యులకు స్కిల్ బర్త్ ఆట్టెన్టెంట్, దక్షత శిక్షణ అందించారు. అదే విధంగా హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి సరైన వైద్యం అందించడానికి 17,110 స్టాఫ్ నర్సులు, 30 మంది వైద్యులకు శిక్షణ ఇచ్చి వీరి ద్వారా 6,095 సెషన్స్‌లో 1,56,099 గర్భిణులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇవన్నీ రామోజీకి పడితే ఒట్టు!
ప్రసవానంతరం బాలింతలకు ఆరోగ్య ఆసరా..
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు చొప్పున భృతి అందిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద రెండు స్కానింగ్, ఒక టిఫా స్కాన్‌ను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి గతేడాది 2,42,106 మంది బాలింతలకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకాలను అధికారులు అందించారు. ప్రభుత్వం ఇలా ఎన్నో చేస్తున్నా రామోజీరావు విషపు రాతలు రాయడం తన ముద్దుల చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికి కాదా?
క్షేమంగా తల్లీబిడ్డను ఇంటికి చేరుస్తున్న ప్రభుత్వం
ప్రసవానికి ముందు గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రసవానంతరం కూడా వారిని క్షేమంగా ఇంటికి చేర్చడానికి అంతే శ్రద్ధ కనబరుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం వైఎస్సార్ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో క్షేమంగా తల్లీబిడ్డను ఇంటికి చేరుస్తున్నారు. నాడు–నేడులో భాగంగా 279 తల్లీబిడ్డ వాహనాల స్థానంలో 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
గతంలో ఒక ట్రిప్పుకు ఇద్దరు బాలింతలను తరలిస్తుండగా ప్రస్తుతం ఒక ట్రిప్పుకు ఒక బాలింత, ఆమె సహాయకులను ఏసీ సదుపాయం ఉన్న వాహనంలో ఇంటి వరకూ తీసుకువెళ్లి సురక్షితంగా దింపుతున్నారు. దీంతో అప్పట్లో ఒక ట్రిప్పుకు కేవలం రూ.499 మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వం హయాంలో ఒక ట్రిప్పుకు రూ.895 ఖర్చు చేస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలను కూడా పట్టించుకోరా?
దేశంలో 100% పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికల్లో కొనియాడింది. ఇవేమీ తనకు పట్ట వనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని ఈనాడులో బురద రాతలకు దిగజా రారు. 24/7 పీహెచ్‌సీలు పనిచేసేలా వైద్య, ఆరో గ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు డాక్టర్‌లను ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో వైద్యులు ఒక్క పూటకు పరిమితం అవుతున్నారని ‘ఈనాడు’ పేర్కొనడం హాస్యాస్పదం కాక మరేమిటి!
2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా..
♦ నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు.
♦ రూ.16,800 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం
♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు
♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు.
♦ టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం
♦ 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. ఇలా మరే ప్రభుత్వంలోనూ లేవు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 108 అంబులెన్స్‌లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి.
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు
Comments
Please login to add a commentAdd a comment