సీఎం జగన్ మాటలను వక్రీకరిస్తూ ఈనాడు తప్పుడు రాతలు
మహిళలు, పిల్లల కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.2.83 లక్షల కోట్లు
ఇందులో డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లో రూ.1.89 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347 కోట్లు
99% హామీల అమలు జగమెరిగిన సత్యం..
పేదల ఇళ్ల కోసం 17,005 జగనన్న కాలనీలు
నాడు–నేడుతో స్కూళ్లకు కొత్త రూపు
కళ్లకు గంతలు కట్టుకుని లోకమంతా చీకటిగా ఉందన్నాడట ఒకడు. సరిగ్గా ఈనాడు రామోజీలాగ. ఆయనాగంతలు విప్పడు. విప్పితే వెలుగును చూడాల్సి వస్తుందన్న భయం. చూస్తే నిజాలు రాయాల్సి వస్తుందన్న జడుపు. నిజాలు రాస్తే తాను, తన ‘బాబు’ గల్లంతైపోతారన్న వణుకు. అందుకే ఆ చీకటిలోనే ‘సిగ్గొ’దిలేసి పచ్చి అబద్ధాలు రాసేస్తున్నాడు.
వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాల్లో 99 శాతం నెరవేర్చింది. జగమెరిగిన ఈ సత్యాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో చెప్పారు. హామీలు అమలు చేశారనేందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి. కాని వాటిని చూసే దమ్ము..ధైర్యం రామోజీకి లేవు. సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాలు అబద్ధాలంటూ పచ్చి అబద్ధాలను వండేశారు.
సాక్షి, అమరావతి: మహిళలు, పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 58 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.2.83 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో నేరుగా డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లో రూ.1.89 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347 కోట్లు మహిళలు, పిల్లల కోసం వెచ్చించారు. ఇందుకు సాక్ష్యం రూ.5.85 కోట్ల ప్రయోజనాలు పొందిన మహిళలు, పిల్లలే. పేదల ఇళ్ల కోసం కొత్తగా 17,005 జగనన్న కాలనీలనే ఏర్పాటు చేశారు. ఏ ఊరు వెళ్లినా ఇవి కనిపిస్తాయి. 31 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ ప్రశంసించింది. ప్రత్యేక హాదాను ముగిసిన అధ్యాయంగా చంద్రబాబు పాతరేస్తే.. ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచింది సీఎం జగన్. దశల వారీగా మద్య నియంత్రణలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలాగ పెంచి వినియోగాన్ని తగ్గించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై 14 నిముషాల పాటు సీఎం జగన్ మాట్లాడటం పెద్ద నేరంగా, తప్పుగా ఈనాడు రామోజీ చిత్రీకరించడం చూస్తుంటే వ్యక్తిగత కక్ష ఎంత ఉందో అర్థం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.
విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అక్షరాస్యతను పెంచే చర్యలను చేపట్టారు. బాల్య వివాహాలు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇచ్చి ంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాకు వధువులు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించడం ద్వారా అక్షరాస్యతను పెంచడం, మరో పక్క బాల్య వివాహాలను నిరోధించడం, ఉన్నత విద్య అభ్యసించేలాగ చర్యలను తీసుకున్నారు. దీని వల్ల బాల్య వివాహాలు తగ్గిన విషయాన్ని సీఎం జగన్ ఈ సభలో చెప్పారు.
దీన్ని వక్రబుద్ధితో చూసి సిగ్గులేని తనాన్ని ఈనాడు రామోజీ బయటపెట్టుకున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిన విషయం ప్రతీ ఊరిలో కనిపిస్తోంది. ఒక గుడ్డి ఈనాడు రామోజీకి తప్ప. నాడు–నేడు ద్వారా స్కూళ్లను తీర్చిదిద్దడాన్ని చూసిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలు చేస్తోంది. 58 నెలల సీఎం జగన్ పాలనలో మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.54 లక్షల కోట్లు పేదలకు ఆర్థిక సాయం అందింది.
ఇందులో డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 2014 ఎన్నికల ముందు రైతులకు, పొదుపు సంఘాల మహిళలు, యువతకు, చేనేత కారి్మకులకు, పేదలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసం చేస్తే.. వైఎస్‌జగన్ ఇచ్చి న హామీల్లో 99 శాతం అమలు చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓటు వేయమని అడుగుతున్నారు.
రైతులకు ఇచ్చి న హామీల అమల్లో చంద్రబాబుకు, సీఎం వైఎస్ జగన్‌కు తేడా ఇలా..
♦ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాను అని అధికారంలోకి వచ్చాక రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను షరతులతో తగ్గించేసి కేవలం రూ.13,500 కోట్లతో సరిపెట్టారు.
♦ 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి 12,500 చొప్పున ఒక్కో రైతుకు నాలుగేళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని ఏడాదికి 13,500కు పెంచి ఒక్కో రైతుకు ఐదేళ్లలో 67,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
♦ 58 నెలల కాలంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు రూ.34,378.16 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment