మన్ననూర్: బాలికల గిరిజన ఆశ్రమపాఠశాలలో 45 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారంరాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో చోటుచేసుకున్నది. మన్ననూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 400 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. గురువారంరాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
కొద్దిసేపటికే 10 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడకపోవడం, కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని అల్లాడిపోయారు. దీంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన తర్వా త అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదే సమయంలో వసతిగృహంలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుండటంతో 4 అంబులెన్స్‌లలో సుమారు 45 మందిని అచ్చంపేటకు తరలించారు. ఆ తర్వాత లారీ తీసుకువచ్చి సుమారు వంద మంది విద్యార్థినులను అచ్చంపేటకు తీసుకెళ్లారు. ఇందులో ఇద్దరు బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment