శ్రీకాకుళం: మండల కేంద్రాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓపీ(అవుట్ పేషెంట్) సేవలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి శ్యామల సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె కొత్తూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు సేవా దృక్పధంతో వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెఓ కృష్ణమోహన్ ఉన్నారు.