తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా రోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా రోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొల్లప్రోలుకు చెందిన మెండి పార్వతి (54)కి వడదెబ్బ తగలడంతో ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురైంది.
కుటుంబ సభ్యులు ఆమెను పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పార్వతి సోమవారం చనిపోయింది. వైద్యురాలు విధుల్లో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే పార్వతి చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యురాలు మాత్రం తాను విధుల్లో లేనని, వేరొక పనిమీద పీహెచ్ సీకి వచ్చానని చెబుతున్నారు.