women dies
-
‘పుష్ప 2’ ప్రీమియర్ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు సీపీఆర్ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. -
విద్యుత్ తీగల రూపంలో మృత్యుపాశం
సాక్షి, కౌతాళం(కర్నూలు) : కూలీలతో కలిసి పొలంలో విత్తనాలు నాటారు. పని ముగింపు దశలో తల్లీకూతురు ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. సాధకబాధకాలు మాట్లాడుకుంటూ భోంచేశారు. తర్వాత తల్లి పైనున్న తీగను పట్టుకుని లేవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా ‘షాక్’! ఆమెకు ఏమైందో తెలీక కాపాడబోయిన కుమార్తెదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలొదిలారు. తర్వాత తెలిసింది వారిని బలిగొన్నది విద్యుత్ తీగ రూపంలోని మృత్యుపాశమని! కౌతాళం మండలం చూడి పంచాయతీ తిప్పలదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై తల్లీ కూతురు నరసమ్మ(58), రామాంజనమ్మ(38) మృతిచెందారు. గ్రామానికి చెందిన సోమిరెడ్డి (లేట్)కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నరసమ్మ. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె రామాంజనమ్మను ఇదే మండల పరిధిలోని చిరుతాపల్లికి చెందిన ఈరన్నకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు సంతానం. ఇటీవల తిప్పలదొడ్డిలో మట్టి ఎద్దుల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం చిరుతాపల్లికి తిరిగి వెళతానని తల్లితో చెప్పింది. ‘రేపు వెళ్దువులే’ అనడంతో ఆమె ప్రయాణాన్ని విరమించుకుంది. తర్వాత తల్లీకూతురు గ్రామానికి చెందిన కూలీలతో కలిసి పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లారు. విత్తనాలు నాటే పని పూర్తవుతున్న దశలో వెళ్లి భోంచేయాలని కూలీలు వారికి సూచించారు. దీంతో తల్లీకూతురు పొలంలోని ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. దాని గుండానే విద్యుత్ తీగలు వెళ్లాయి. ఈ విషయాన్ని వారు గమనించలేదు. భోజనం పూర్తి కాగానే నరసమ్మ పైకి లేవడానికి సపోర్టుగా పైనున్న తీగ పట్టుకుంది. క్షణాల్లోనే విద్యుత్ షాక్‌కు గురైంది. గిలగిలా కొట్టుకుంటుండగా కుమార్తె కాపాడబోయింది. ఆమె కూడా షాక్‌కు గురైంది. పొలంలోని కూలీలు గమనించి హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆలోపే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారొచ్చి విద్యుత్ తీగలను వేరుచేసి.. ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా కన్పిస్తోంది. విద్యుత్ తీగలు ఇంత కింద వేలాడుతున్నా సరిచేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
దేవరకద్ర రూరల్: మండలంలోని గోపన్‌పల్లి శివారులోని కోళ్లఫారాల పక్కనున్న వ్యవసాయ పొలంలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయి మృతిచెందిన ఓ మహిళ శవాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు గోపన్‌పల్లి గ్రామానికి చెందిన కోట్ల లక్ష్మి(45)గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గోపన్‌పల్లికి చెందిన కోట్ల గోపాల్‌రెడ్డితో ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన లక్ష్మికి గత 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే లక్ష్మి అనుమానాస్పదంగా పూర్తిగా కాలి మృతిచెంది వ్యవసాయ పొలంలో శవమై తేలింది. విషయం తెలుసుకున్న సీఐ పాండురంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లును వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శవ పంచనామ అనంతరం మృతురాలి శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు లక్ష్మిని అల్లుడు గోపాల్‌రెడ్డి చంపి నిప్పంటించి ఉంటాడని మృతురాలి తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
బేతంచర్ల: పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. దుర్గంపేటకు చెందిన రామలక్ష్మి(45) రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతున్న సమయంలో డోన్ నుంచి విజయవాడ వెళ్లే గరిబ్‌రథ్ రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బీభత్సం.. మహిళ మృతి
కీసర: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన కీసర మండలం చీర్యాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లావణ్య అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. చిరు వ్యాపారితో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి
రేగోడ్(మెదక్ జిల్లా): రేగోడ్ మండలం గజ్వాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వాగులో ఓ మహిళ కొట్టుకుపోయి మృతిచెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన సాయమ్మ(35)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వినాయక చవితి వేడుకల్లో అపశృతి
కామేపల్లి(ఖమ్మం జిల్లా): కామేపల్లి మండలం పండితాపురంలో జరిగిన వినాయకచవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జన ఉత్సవం సందర్భంగా గ్రామంలోని యువకులు బాణసంచా పేల్చారు. దీంతో పక్కనే ఉన్న పశువులు బెదిరి ఇద్దరు మహిళలను తొక్కాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ దనియాకుల శకుంతల(50) అనే మహిళ బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మహిళ మృతి
పుట్టపర్తి(అనంతపురం): అనంతపురం నుంచి బెంగళూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో పుట్టపర్తి వద్ద ఆక్సిజన్ అయిపోవడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అనంతపురం వేణుగోపాలనగర్‌కు చెందిన శోభారాణి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో బెంగుళూరుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆక్సిజన్ అయిపోయింది. దాంతో శోబారాణి అంబులెన్స్‌లోనే మృతిచెందింది. అంబులెన్స్ సిబ్బంది ఆక్సిజన్ ఉందోలేదో చూసుకోకపోవడంవల్లే శోభారాణి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
చావబోయి.. చంపాడు
కేకే.నగర్(చెన్నై): దంపతుల మధ్య జరిగిన భర్త ఆత్మహత్యాయత్నం చేసేందుకు కారణమైంది. పై అంత స్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకునే క్రమం లో కింద ఉన్న వృద్ధురాలిపై ఆ వ్యక్తి పడడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై, అశోక్‌నగర్ నల్లికుప్పం స్లమ్ క్లియరెన్స్ కు చెందిన సెల్వం (35) ఆటోడ్రైవర్. సోమవారం రాత్రి సెల్వంకు, భార్యకు మధ్య గొడవ జరిగింది. విరక్తి చెందిన సెల్వం తాము ఉంటున్న హౌసింగ్‌బోర్డు నాల్గో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ సమయంలో అంతస్తు కింద నిల్చుని ఉన్న శారద (76)పై పడ్డాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దర్నీ వెంటనే 108లో రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు శారద అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విష జ్వరంతో మహిళ మృతి
పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా): పాల్వంచ మండలం ఉల్లనూరు పంచాయతీ మల్లారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలం సమ్మక్క(52) అనే మహిళ విష జ్వరంతో గురువారం ఉదయం మృతిచెందింది. ఐదు రోజులుగా సమ్మక్క జ్వరంతో బాధపడుతోంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నిన్న సాయంత్రం(బుధవారం) తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. -
నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం
బోగోలు(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని బోగోలు మండలం కప్పరాళ్లచిప్ప గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లో ఉన్న ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి
వినుకొండ(గుంటూరు): కొడుకును ఉన్నత చదువుల కోసం పంపించి తిరిగి వస్తున్న దంపతుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ శివారులోని విఠంరాజుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వినుకొండకు చెందిన వెంకట శ్రీనివాసరావు దంపతులు కుమారుడిని విశాఖలోని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో చేర్పించి కారులో తిరిగి వస్తుండగా.. కారు విఠంరాజుపల్లి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య శ్రీదేవి(35) అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
పీహెచ్సీలో మహిళా రోగి మృతి
గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా రోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొల్లప్రోలుకు చెందిన మెండి పార్వతి (54)కి వడదెబ్బ తగలడంతో ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పార్వతి సోమవారం చనిపోయింది. వైద్యురాలు విధుల్లో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే పార్వతి చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యురాలు మాత్రం తాను విధుల్లో లేనని, వేరొక పనిమీద పీహెచ్ సీకి వచ్చానని చెబుతున్నారు. -
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
-
వైద్యుడు పొలిమేర దాటొద్దన్నాడని..
కోరుట్ల/కథలాపూర్ : మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పాముకాటుకు మందు వేసిన నాటువైద్యుడు చేసిన హెచ్చరిక మేరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఓ మహిళ మృత్యువాత పడిన ఉదంతమిది. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన తెడ్డు శిరీష(30) బుధవారం రాత్రి పాముకాటుకు గురైంది. భర్త అంజయ్య వెంటనే దుంపెట గ్రామానికి చెందిన ఓ నాటువైద్యుడి వద్దకు శిరీషను తీసుకెళ్లాడు. ఆమెకు చికిత్స చేసిన నాటువైద్యుడు.. మూడు రోజులపాటు ఊరి పొలిమేర దాటొద్దని.. దాటితే మందు పనిచేయదని చెప్పాడు. దానినే గుడ్డిగా నమ్మిన శిరీష కుటుంబసభ్యులు నాటువైద్యుని ఇంటి సమీపంలో ఉన్న ఓ కొట్టంలోనే ఉన్నారు. పాము కాటు వేసిన కాలు వాపు వచ్చి.. పరిస్థితి విషమించిందినా.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారు. చివరికి శనివారం శిరీష పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మెట్‌పల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శిరీష చనిపోయింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
గోనెగండ్ల: ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రేసమ్మ (35) అనే మహిళను కర్నూలు నుంచి రాయదుర్గం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నల్గొండ: భువనగిరి మండలం రాయగిరి గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రోడ్డుపై ఆటోకోసం వేచి ఉన్న మహిళను కారులో వస్తున్న వ్యక్తి గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన మహిళ నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన మేకల సుజాత(28)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రంగారెడ్డి(పూడూరు): రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఓ చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వాగులో పడి వివాహిత మృతి
అదిలాబాద్(దహేగాం): వాగులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన దహేగాం మండలం రాళ్లగూడలో చోటుచేసుకుంది. గ్రామంలోని పెద్దవాగులో కారు రేవతి(24) అనే వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె చెప్పులు గట్టుపై వదిలేయడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
మిద్దె కూలి మహిళ మృతి
గోపాల్పేట: మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్, సుగుణమ్మ(40) దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం వేకువజామున ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి వారిపైన పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుగుణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. గాయాలైన వెంకటయ్య స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.