వినాయక చవితి వేడుకల్లో అపశృతి | women dies in pandithapuram vinayaka chavithi celebration | Sakshi
Sakshi News home page

వినాయక చవితి వేడుకల్లో అపశృతి

Sep 14 2016 1:41 PM | Updated on Sep 4 2017 1:29 PM

కామేపల్లి మండలం పండితాపురంలో జరిగిన వినాయకచవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.

కామేపల్లి(ఖమ్మం జిల్లా): కామేపల్లి మండలం పండితాపురంలో జరిగిన వినాయకచవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జన ఉత్సవం సందర్భంగా గ్రామంలోని యువకులు బాణసంచా పేల్చారు. దీంతో పక్కనే ఉన్న పశువులు బెదిరి ఇద్దరు మహిళలను తొక్కాయి.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ దనియాకుల శకుంతల(50) అనే మహిళ బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement