ఘనంగా వినాయక చవితి వేడుకలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే వినాయక ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఖైరతాబాద్‌లో ఈ సారి 58 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ దంపతులు ఇక్కడ తొలిపూజ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్.. ఖైరతాబాద్ గణేశుడికి 500 కిలోల లడ్డూను తయారుచేసింది. విజయవాడలో 72 అడుగుల డుండీ గణేషుడిని ఏర్పాటుచేశారు. విశాఖలోని గాజువాకలో 78 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేయడం విశేషం.
కానిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రరాంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. శ్రీశైల ఆలయంలో ఈ నెల 14 వరకు గణేష్ నవరాత్రీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.