వాగులో పడి వివాహిత మృతి | women dies after drown in water in adilabad | Sakshi
Sakshi News home page

వాగులో పడి వివాహిత మృతి

Published Sun, Aug 9 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

women dies after drown in water in adilabad

అదిలాబాద్(దహేగాం): వాగులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన దహేగాం మండలం రాళ్లగూడలో చోటుచేసుకుంది. గ్రామంలోని పెద్దవాగులో కారు రేవతి(24) అనే వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె చెప్పులు గట్టుపై వదిలేయడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement