సాక్షి, హైదరాబాద్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది.
దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు సీపీఆర్ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment