నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య | Five Months Pregnent Woman Suicide in Doddaballapura Karnataka | Sakshi
Sakshi News home page

నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య

Published Fri, Jan 28 2022 6:21 AM | Last Updated on Fri, Jan 28 2022 6:21 AM

Five Months Pregnent Woman Suicide in Doddaballapura Karnataka - Sakshi

భర్తతో జాహ్నవి (ఫైల్‌)    

భర్త నిత్యం ఫోన్‌ చేసి మాటలతో హింసిస్తుండడంతో విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దొడ్డబళ్లాపురం (బెంగళూరు): ఎన్నో ఆశలతో పుట్టింటికి వెళ్లిన యువతికి భర్త నరకం చూపించాడు. ఇది తట్టుకోలేక 5 నెలల గర్భిణి తనువు చాలించిన విషాద సంఘటన రామనగర పట్టణ పరిధిలోని మంజునాథనగరలో చోటుచేసుకుంది. జాహ్నవి (23) ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత. రామనగరకు చెందిన జాహ్నవిని 9 నెలల క్రితం పాండవపుర తాలూకా బల్లేనహళ్లి గ్రామానికి చెందిన కర్ణతో వివాహం జరిపించారు.

ప్రస్తుతం 5 నెలల గర్భిణి. కర్ణ నిత్యం మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది తట్టుకోలేక ఆమె నెల రోజుల క్రితం రామనగరలోని పుట్టింటికి వచ్చింది. అయినా భర్త నిత్యం ఫోన్‌ చేసి మాటలతో హింసిస్తుండడంతో విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐజూరు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు కర్ణపై ఫిర్యాదు చేశారు.   

చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement