doddaballapura
-
భార్య మృతితో భర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): భార్య మృతితో తీవ్ర ఆవేదనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేవహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో చోటుచేసుకుంది. విజయేంద్ర (38) భార్య లావణ్య (34) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందింది. వీరిద్దరికీ 9 ఏళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. భార్య వైద్యం కోసం విజయేంద్ర పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇంటి ముందే చిల్లర అంగడి నడుపుకుంటున్న విజయేంద్ర గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) -
నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): ఎన్నో ఆశలతో పుట్టింటికి వెళ్లిన యువతికి భర్త నరకం చూపించాడు. ఇది తట్టుకోలేక 5 నెలల గర్భిణి తనువు చాలించిన విషాద సంఘటన రామనగర పట్టణ పరిధిలోని మంజునాథనగరలో చోటుచేసుకుంది. జాహ్నవి (23) ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత. రామనగరకు చెందిన జాహ్నవిని 9 నెలల క్రితం పాండవపుర తాలూకా బల్లేనహళ్లి గ్రామానికి చెందిన కర్ణతో వివాహం జరిపించారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణి. కర్ణ నిత్యం మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది తట్టుకోలేక ఆమె నెల రోజుల క్రితం రామనగరలోని పుట్టింటికి వచ్చింది. అయినా భర్త నిత్యం ఫోన్ చేసి మాటలతో హింసిస్తుండడంతో విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐజూరు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు కర్ణపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?) -
తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు
సాక్షి, బెంగళూరు (దొడ్డబళ్లాపురం): విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి (53), కుమారుడు సోమనింగప్ప (28) కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. సోమవారం ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. రాత్రికి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందారు. బజ్జీల్లో పురుగులు మందు కలిసి ఉంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కుట్ర పన్ని చేశారా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (నటి సంజన వీరంగం..!) -
దారుణం: కారు బైక్ ఢీ.. మామ, కోడలు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం: వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో మామ, కోడలు మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా మల్లరబాణవాడి గ్రామంలో చోటుచేసుకుంది. గుల్బర్గా జిల్లా మాదాబకు చెందిన గీత (35), సూర్యకాంత్ (45) మృతి చెందారు. సూర్యకాంత్ కుటుంబం జీవనోపాధి కోసం నెలమంగల వచ్చి శాంతినగర్లో స్థిరపడ్డారు. కొత్తగా బైక్ కొన్న వీరు ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక ఊరిలో తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న యువకుడు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు కడూరుకు చెందిన సంజయ్ (19) నెలమంగలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని రెస్ట్ రూంకి వెళ్లి ఎంతసేపయినా రాకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చి చూడగా సంజయ్ మత్తుమందు ఎక్కువ డోస్ తీసుకుని చనిపోయి ఉన్నాడు. దీనిపై అతని తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఐసీయూలో నటుడు సత్యజిత్.. పరిస్థితి విషమం) -
మరో 3 కోట్లు ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి, ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్దేవ్ బెంగళూరు సంజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రామదాసుపై భూముల కేసు మైసూరు: మైసూరు మళలవాడి ప్రాంతంలో ఉన్న భూముల అక్రమాల్లో కే.ఆర్.నగర బీజేపి ఎమ్మెల్యే ఎస్.ఎ.రామదాసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 1994లో అప్పటి కలెక్టర్ విజయభాస్కర్ మళలవాడి భూముల అక్రమాలపైన విచారణ చేసి రామదాసుపైన నివేదికను ఇచ్చారు. 2008లో లక్ష్మిపురం పోలీస్ స్టేషన్లోనూ రామదాసుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్లు వేశారు. పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. చదవండి: ఈ 3 రాష్ట్రాల్లో పాత వాహనాలు ఎక్కువ -
క్యాట్ స్నేక్ను బంధించిన స్నేక్ లోకేశ్
దొడ్డబళ్లాపురం: అరుదుగా కనిపించే క్యాట్ స్నేక్ (పిల్లి కళ్ల పాము) ఒక్కసారిగా జనావాసాల్లోకి రావడంతో కలకలం రేగింది. కర్ణాటకలోని నెలమంగల తాలూకా ఎంటగానహళ్లిలో పిల్లికళ్ల పామును చూసిన స్థానికులు వెంటనే ‘స్నేక్ లోకేశ్’ కు సమాచారం అందించారు. వణ్యప్రాణి ప్రేమికుడైన లోకేశ్.. స్థానికంగా ‘స్నేక్ లోకేశ్’గా ఫేమస్. చాకచక్యంగా పామును బంధించిన లోకేశ్.. దానిని తిరిగి అడవిలోకి వదిలేశారు. అరుదైన పాము: లోకేశ్ క్యాట్ స్నేక్ పచ్చని ప్రదేశాల్లో, కొండగుట్టల్లో మాత్రమే ఉంటుందని స్నేక్ లోకేశ్ తెలిపాడు. క్రిమికీటకాలను, చిన్న చిన్న ప్రాణులను తిని జీవించే ఈ పాము ఒకసారికి 5 నుంచి 10 గుడ్లు పెడుతందన్నారు. దీని శరీరం బూడిద రంగు, నలుపు, తెలుపు రంగుల మిశ్రితమై ఉంటుందన్నారు. పామును దూరంగా అరణ్యప్రదేశంలో వదిలిపెట్టాడు.