
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి, ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్‌దేవ్ బెంగళూరు సంజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
రామదాసుపై భూముల కేసు
మైసూరు: మైసూరు మళలవాడి ప్రాంతంలో ఉన్న భూముల అక్రమాల్లో కే.ఆర్.నగర బీజేపి ఎమ్మెల్యే ఎస్.ఎ.రామదాసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 1994లో అప్పటి కలెక్టర్ విజయభాస్కర్ మళలవాడి భూముల అక్రమాలపైన విచారణ చేసి రామదాసుపైన నివేదికను ఇచ్చారు. 2008లో లక్ష్మిపురం పోలీస్ స్టేషన్‌లోనూ రామదాసుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్లు వేశారు. పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment