
విజయేంద్ర, భార్య లావణ్య (ఫైల్)
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): భార్య మృతితో తీవ్ర ఆవేదనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేవహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో చోటుచేసుకుంది. విజయేంద్ర (38) భార్య లావణ్య (34) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందింది. వీరిద్దరికీ 9 ఏళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు.
భార్య వైద్యం కోసం విజయేంద్ర పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇంటి ముందే చిల్లర అంగడి నడుపుకుంటున్న విజయేంద్ర గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment