Husband commit suicide
-
భార్య మృతితో భర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): భార్య మృతితో తీవ్ర ఆవేదనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేవహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో చోటుచేసుకుంది. విజయేంద్ర (38) భార్య లావణ్య (34) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందింది. వీరిద్దరికీ 9 ఏళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. భార్య వైద్యం కోసం విజయేంద్ర పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇంటి ముందే చిల్లర అంగడి నడుపుకుంటున్న విజయేంద్ర గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
పి.గన్నవరం : ఉదయాన్నే మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించడంతో మనస్తాపానికి గురై అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో మంగళవారం జరిగింది. పి.గన్నవరం ఎస్ఐ జి.హరీష్ కుమార్ కథనం ప్రకారం... ఊడిమూడికి చెందిన పసుపులేటి తాతాజీ (30) మంగళవారం ఉదయాన్నే మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని గ్రహించిన భార్య కుమారి భర్తను మందలించింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన తాతాజీ పురుగుల మందు సేవించాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి, తాను పురుగుల మందు తాగినట్లు భార్యకు చెప్పాడు. దాంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు తాతాజీని 108 అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్‌కుమార్ తెలిపారు. -
కౌన్సిలింగ్ ఇచ్చారన్న అవమానంతో ఆత్మహత్య
చిత్తూరు: పీలేరు మండలం ఎర్రగుండ్లపల్లిలో భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడు మృతికి పోలీసులే కారణమని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. స్థానికుల కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.