భార్య మందలించిందని భర్త ఆత్మహత్య | husband commit suicide | Sakshi
Sakshi News home page

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

Published Tue, Jan 27 2015 9:28 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

husband commit suicide

పి.గన్నవరం : ఉదయాన్నే మద్యం తాగి వచ్చిన భర్తను  భార్య మందలించడంతో మనస్తాపానికి గురై  అతను  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో మంగళవారం జరిగింది. పి.గన్నవరం ఎస్ఐ జి.హరీష్‌ కుమార్ కథనం ప్రకారం... ఊడిమూడికి చెందిన పసుపులేటి తాతాజీ (30) మంగళవారం ఉదయాన్నే మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

ఈ విషయాన్ని గ్రహించిన భార్య కుమారి భర్తను మందలించింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన తాతాజీ పురుగుల మందు సేవించాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి, తాను పురుగుల మందు తాగినట్లు భార్యకు చెప్పాడు. దాంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు తాతాజీని 108 అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్‌కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement