క్యాట్‌ స్నేక్‌ను బంధించిన స్నేక్‌ లోకేశ్‌ | snake lokesh catched the cat snake | Sakshi
Sakshi News home page

క్యాట్‌ స్నేక్‌ను బంధించిన స్నేక్‌ లోకేశ్‌

Published Thu, Jun 8 2017 7:03 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

క్యాట్‌ స్నేక్‌ను బంధించిన స్నేక్‌ లోకేశ్‌ - Sakshi

క్యాట్‌ స్నేక్‌ను బంధించిన స్నేక్‌ లోకేశ్‌

దొడ్డబళ్లాపురం: అరుదుగా కనిపించే క్యాట్‌ స్నేక్‌ (పిల్లి కళ్ల పాము) ఒక్కసారిగా జనావాసాల్లోకి రావడంతో కలకలం రేగింది. కర్ణాటకలోని నెలమంగల తాలూకా ఎంటగానహళ్లిలో పిల్లికళ్ల పామును చూసిన స్థానికులు వెంటనే ‘స్నేక్‌ లోకేశ్‌’ కు సమాచారం అందించారు.

వణ్యప్రాణి ప్రేమికుడైన లోకేశ్‌.. స్థానికంగా ‘స్నేక్‌ లోకేశ్‌’గా ఫేమస్‌. చాకచక్యంగా పామును బంధించిన లోకేశ్‌.. దానిని తిరిగి అడవిలోకి వదిలేశారు.

అరుదైన పాము: లోకేశ్‌
క్యాట్‌ స్నేక్‌  పచ్చని ప్రదేశాల్లో, కొండగుట్టల్లో మాత్రమే ఉంటుందని స్నేక్‌ లోకేశ్‌ తెలిపాడు. క్రిమికీటకాలను, చిన్న చిన్న ప్రాణులను తిని  జీవించే ఈ పాము ఒకసారికి 5 నుంచి 10 గుడ్లు పెడుతందన్నారు. దీని శరీరం బూడిద రంగు, నలుపు, తెలుపు రంగుల మిశ్రితమై ఉంటుందన్నారు. పామును దూరంగా అరణ్యప్రదేశంలో వదిలిపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement