
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఓ వైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపు అత్యవసర సేవల్లోనూ పాల్పంచుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన ఓ గర్బణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేశారు. పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడగలిగారు. దీంతో డెలివరీ చేసిన వైద్యులను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. వైరస్ సోకినా తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత వారిని స్వస్థలానికి పంపుతామని వైద్యులు తెలిపారు. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment