
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సేవా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా అందరూ కళ్లారా చూస్తున్నారు. సోనూసూద్ ఇతరులకు సహాయ కార్యక్రమాలు చేస్తుంటే ఆయన ఆదర్శంగా మనమెందుకు చేయకూడదని ఓ ఆటోవాలా భావించాడు. తన చేతిలో ఉన్న కళను సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటూ సోనూసూద్‌పై అభిమానం చాటుకుంటున్నాడు. సోనూసూద్ అభిమాని అయిన ఈ ఆటో డ్రైవర్ వికలాంగులకు, గర్భిణులకు, అవిటివారికి తన ఆటోలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ సేవాతత్పరత చాటుకుంటున్నాడు. ఆయన చేస్తున్న ఈ సేవ ప్రతి ఒక్కరినీ కదిలించడమే కాకుండా సోనూసూద్‌ను మరోసారి గుర్తు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment