
పెద్దపల్లి : కాన్పు కోసం వచ్చిన లింగంపల్లి విజయ(30)అనే గర్భిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది నర్సులతో వైద్యం చేపించి నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలు తీశారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతురాలికి ఇప్పటికే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండవ కాన్పు కోసమని వస్తే బిడ్డ పుట్టకముందే మహిళ మరణించిందన్నారు. రోడ్డుపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment