godhavarikhani
-
దశాబ్దం కల సాకారమైన వేళ
గోదావరిఖని: సింగరేణి పరిధిలోని గిరిజన ప్రాంతాల యువత జీవితాల్లో వెలుగులు నిండాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 665 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో 309 మంది యువకులకు ఆదివారం ఉద్యోగ పత్రాలను అందించింది. సింగరేణి గనుల విస్తరణతో భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులను సంస్థ యాజమాన్యం ఆదుకోవాలని దశాబ్దకాలంగా పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల గిరిజన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం 2018లో రాత పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కొంతమంది దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడంతో ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేసింది. కాగా, గిరిజన యువతకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు కూడా 27 డిసెంబర్ 2021న సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడగా.. కోల్‌బెల్ట్‌ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంస్థ సీఎండీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా చేశారు. దీంతో సమస్యలను పరిష్కరించి ఇటీవల పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 665 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదివారం ఒక్కరోజే 309 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దశలవారీగా మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంగరేణి వర్గాలు తెలిపాయి. తమ పోరాటం ఫలించిందని, దశాబ్దాల కల నెరవేరిందని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేస్తూ బతుకుతున్నా.. సింగరేణి ఉద్యోగం రావ డం సంతోషంగా ఉంది. డిగ్రీ చదివినా ఉద్యోగం లేక కూలీ పనిచేసుకుంటున్న. 2018లో సింగరేణిలో పరీక్ష రాశా. గిరిజనులకు ఉద్యోగాలను ప్రకటించడం ఆనందంగా ఉంది. – మూడు రఘు, చౌడవరంతండా, సత్తుపల్లి సంతోషంగా ఉంది మాది పేద కుటుంబం. బీ ఫార్మసీ పూర్తి చేశా. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్‌కు హాజరైనా ఉద్యోగం రాలే దు. సింగరేణి పరీక్షలో పాల్గొన్నా. ఫలితాలు ఆలస్యమైనా, సంస్థలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. – లూనావత్ రమేశ్, నర్సింహులపేట, మహబూబాబాద్ ఊహించలేదు.. సింగరేణిలో ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలు పెండింగ్‌లో పె ట్టారు. ఉద్యోగం రావడం మర్చిపో లేని రోజు. – ఇస్లావత్ రాజ్‌కుమార్, రాజీవ్‌నగర్‌తండా, యైటింక్లయిన్‌కాలనీ చిక్కులు అధిగమించి గిరిజన యువతకు ఉద్యోగాలిచ్చే విషయంలో అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఇబ్బందులను అధిగమించి 309 మందికి ఒకేరోజు ఉద్యోగాలివ్వ డం సంతృప్తినిచ్చింది. మిగతా వారికి కూడా దశల వారీగా ఉద్యోగాలిస్తాం. – బలరాంనాయక్, డైరెక్టర్, సింగరేణి -
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
సింగరేణిలో ‘సౌర’ కాంతులు
గోదావరిఖని (రామగుండం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టిసారించింది. తాజాగా శనివారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మరో 81 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 90 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభ దశలో ఉన్నా యి. మరో 81 మెగావాట్ల సోలార్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సంస్థ పరిధిలోని 1,500 ఎకరాల్లో మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం రూ.1, 350 కోట్లు ఖర్చు చేయాలని బోర్డు నిర్ణ యించింది. ఒక మెగావాట్ విద్యుత్ కోసం రూ.4.28 కోట్ల బడ్జెట్, నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించి ప్లాంట్లు ఏర్పా టు చేస్తోంది. మణుగూరులో 30 మెగావా ట్లు, జైపూర్ థర్మల్ ప్లాంట్ ఆవరణలో 10 మెగావాట్లు, ఆర్జీ–3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లెందులో 39 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల పనులు జరుగుతున్నా యి. వీటిని భారత్‌హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ నిర్మి స్తోంది. మణుగూరు ఏరియాలో నిర్మించిన 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో నిర్మించిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి. రెండోదశ కేంద్రాలు వేగవంతం రెండోదశలో నిర్మాణం 90 మెగావాట్ల సో లార్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిలో 10 మెగావాట్లు భూపాలపల్లి, 43 మెగావాట్లు మందమర్రి, 37 మెగావాట్ల ప్లాంట్‌ను కొత్తగూడెంలో ఏర్పా టు చేయనున్నారు. వీటిని అదానీ సంస్థ నిర్మిస్తోంది. మూడో దశలో 81 మెగావాట్లు.. మూడో దశలో 81 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 32 మెగావాట్లు ఓసీపీ డంప్‌యార్డులపై, 15 మెగావాట్లు సింగరే ణి ప్రాంతంలోని జలాశయాలపై, 34 మెగా వాట్ల ప్లాంట్లు సంస్థలోని స్థలాల్లో నిర్మించనున్నారు. జలాశయాలపై 500 మెగావాట్లు.. రాష్ట్రంలో ఉన్న భారీ జలాశయాలపై మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజ మాన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలసి సంస్థ నివేదిక రూపొందించింది. త్వరలో దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!
గోదావరిఖని: అసలే కరోనా వైరస్.. మార్చి నెల వేతనంలో 50 శాతం కోత.. పెరిగిన ఖర్చులు.. పెండింగ్ బకాయిల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తుందా లేదా అన్న ఉత్కఠకు తెరపడింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ లాభాలు ఆరు నెలల తర్వాత యాజమాన్యం తేల్చినట్లు సమాచారం. రూ.993 కోట్లు సంస్థకు లాభాలు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన బోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాభాలు తేల్చినట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఇరవై ఏళ్ల క్రితం లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు ప్రారంభమైంది. సంస్థ నష్టాల్లో ఉన్న కాలంలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఏఐటీయూసీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఇలా 1999లో మొదలైన కార్మికుల లాభాల వాటా పంపిణీ నేటికీ కొనసాగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ రూ.1,766 కోట్ల లాభాలను యాజమాన్యం ప్రకటించింది. అందులో కార్మికుల వాటా 28 శాతం వాటా చెల్లించింది. ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్ష వరకు లాభాల బోనస్ అందింది. ఈసారి భారీగా తగ్గిన లాభాలు సింగరేణిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో లాభాలు భారీగా తగ్గాయి. ఈసారి రూ.993 కోట్లుగా చెబుతున్నారు. గతేడాది ఇదే లాభాల వాటా రూ.1766 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే సగానికి తగ్గినట్లుగా తెలుస్తోంది. కార్మికులకు చెల్లించే బోనస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 35 శాతం వాటాకు డిమాండ్ గతేడాది సింగరేణి సాధించిన లాభాల్లో 28 శాతం కార్మికుల వాటా యాజమాన్యం చెల్లించగా, ఈసారి 35 శాతం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించారు. లాభాల వాటా ప్రకటన ముఖ్యమంత్రి పరిధిలో ఉండటంతో గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్ నేతలు కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలసి సీఎంను కలవాలని చూస్తున్నారు. 23న లాభాల వాటా ఇప్పిస్తాం కార్మికులకు లాభాల వాటా ఈ నెల 23న ఇప్పిస్తాం. మార్చిలో నిలిపివేసిన సగం వేతనం కూడా ఇదే రోజున చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కోవిడ్‌తో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఇప్పిస్తాం. దీనికి యాజమాన్యం అంగీకరించింది. త్వరలో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి లాభాల వాటాపై చర్చిస్తాం. – బి.వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మార్చి వేతనంతో లాభాల వాటా చెల్లించాలి సింగరేణి లాభాల్లో ఈసారి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. కోవిడ్ నేపథ్యంలో గత మార్చిలో కార్మికుల వేతనంలో కోత విధించిన 50 శాతం కూడా ఈ నెలలో చెల్లించాలి. దసరా ఆదివారం వస్తున్నందున కార్మికులు నష్టపోకుండా పండుగకు ముందే లాభాల వాటా చెల్లించేలా చూడాలి. – కెంగర్ల మల్లయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి సంస్థ లాభాలు రూ.993 కోట్లుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తేల్చిన నేపథ్యంలో అందులో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. మార్చిలో కోత విధించిన 50 శాతం వేతనం కూడా లాభాల వాటాతో కలిపి ఇవ్వాలి. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైంది. కార్మికులకు ఇబ్బంది కలుగకుండా యాజమాన్యం వెంటనే చెల్లించేలా చూడాలి. -
నాటి వైఎస్సార్ నుంచి నేటి కేసీఆర్ వరకు..
సాక్షి, గోదావరిఖని (కరీంనగర్) : రాష్ట్ర, జాతీయస్థాయి అతిథులకు నిలయంగా , అద్భుతమైన వంటకాలతో ప్రత్యేకతను చాటుకుంటోంది రామగుండం ఎన్టీపీసీ జ్యోతిభవన్. 2004లో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక మంది ప్రముఖులు ఇక్కడి గృహంలోనే బస చేశారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో సహా ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తే ఇదే అతిథిగృహాన్ని ఎంచుకోవడం విశేషం. తాజాగా సీఎం ప్రత్యేకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ఈప్రాంతానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఇదే అతిథి గృహానికి చేరుMýనారు. మరోసారి ఈ గెస్ట్‌హౌజ్ విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వచ్చే అతిథులు బస చేసేందుకు జ్యోతిభవన్ గెస్ట్‌హౌజ్ నిర్మించారు. 1986లో అప్పటి డైరెక్టర్ వి.సుందరరాజన్ గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు అతిథుల సేవలో తరిస్తోంది. 2006లో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈప్రాంత పర్యటనకు వచ్చినపుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. ఆతర్వాత 2004లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్వీ సాహి గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. అలాగే 2006లో న్యూజిలాండ్‌కు చెందిన విదేశీయులు ఇదే గెస్ట్‌హౌజ్‌లో విడిది చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మదన్మోహన్ బి లోకూర్ 2011లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో ఆతిథ్యం స్వీకరించారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పీసీ బోస్ 2012లో ఈ ప్రాంతానికి వచ్చారు. అలాగే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదిలో రెండుసార్లు జ్యోతిభవన్‌లో బస చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా ఉండే గెస్ట్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతిభవన్‌లోనే బస చేశారు. చదవండి: మేడం వచ్చారు భవనం ప్రత్యేకతలు ఇవే.. చుట్టూ పచ్చదనంతో పరుచుకున్న పచ్చిక, విశాలమైన రోడ్లు, కాలుష్యానికి ఆమడదూరంలో గెస్ట్‌హౌజ్ నిర్మించడం ప్రత్యేకత సంతరించుకుంది. 1986లో ప్రారంభించిన గెస్ట్‌హౌజ్ ఎన్టీపీసీ అతిథుల కోసం కేటాయించారు. అయితే గెస్ట్‌హౌజ్ ప్రాంగణం విశాలంగా ఉండడంతోపాటు రాష్ట్ర, కేంద్రాల నుంచి వచ్చే అతిథులు బస చేసేందుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ కూడా గెస్ట్‌హౌజ్‌కు సమీపంలోనే ఉండడంతో వీఐపీలు బస చేసేందుకు మరింత అనుకూలంగా మారింది. నిరంతర విద్యుత్ సరఫరా, అతిథులను ఒప్పించి మెప్పించే వంటకాలతోపాటు అన్ని ఏర్పాట్లు ఇందులో ఉండడంతో అతిథులు ఈ జ్యోతిభవన్‌లోనే ఉండేందుకు మక్కువ చూపుతు న్నారు. ఇండియన్ కాఫీ హౌజ్ ఆతిథ్యం గెస్ట్‌హౌజ్‌లో బస చేసే వారికోసం ఇండియన్ కాఫీ హౌజ్ ద్వారా నార్తిండియన్ వంటకాలు తయారు చేస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం అతిథులకు వడ్డించేందుకు ఇండియన్ కాఫీ హౌజ్‌ను కాంట్రాక్ట్ ద్వారా కేటాయించింది. నార్తిండియన్లతోపాటు తెలంగాణ ప్రాంత అతిథులకు కూడా ఇక్కడి వంటకాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
ఆల్‌ఫ్రీ పేరుతో.. సరికొత్త మోసం
సాక్షి, గోదావరిఖని : ఆల్‌ఫ్రీ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది ఓ ముఠా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ చేస్తామని ఎలాంటి రోగాన్ని అయినా నయం చేస్తామంటూ ప్రజలను నమ్మబలికించారు. కానీ థెరపీకి కావాల్సిన కిట్స్ కొంటే ఇంటికే వచ్చి థెరపీ చేస్తామన్నారు. ఆశపడి ప్రజలు రూ.20 వేల నుంచి 60 వేలు చొప్పున ఆడ్వాన్సులు చెల్లించి చికిత్సకు కావాల్సిన వస్తువులను కొన్నారు. థెరపీకి అవసరమైన మ్యాట్, స్టీమ్, స్టోన్స్‌లను భారీ ధరలకు విక్రయించి ప్రజలకు టోకరా ఇచ్చారు. థెరపీ ఉచితమేకదా అని ప్రజలకు కిట్స్‌ను కొన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఆ సెంటర్ మూసి ఉండటంతోపాటూ ప్రచార బోర్డు తొలగించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ. 60 లక్షలు కాజేసి బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది. -
గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ పేరుతో మోసం
-
వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి!
పెద్దపల్లి : కాన్పు కోసం వచ్చిన లింగంపల్లి విజయ(30)అనే గర్భిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది నర్సులతో వైద్యం చేపించి నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలు తీశారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి ఇప్పటికే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండవ కాన్పు కోసమని వస్తే బిడ్డ పుట్టకముందే మహిళ మరణించిందన్నారు. రోడ్డుపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వివాహిత ఆత్మహత్య
గోదావరిఖని(పెద్దపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన రెజీనా(34) కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
గోదావరిఖని(పెద్దపల్లి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తరుణ్(25), నాగార్జున(26) బైక్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
కట్టుకున్న భర్తే కాలయముడై..
-
కట్టుకున్న భర్తే కాలయముడై..
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): కట్టుకున్న భర్తే కాలయముడై అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం జరిగింది. వివరాలు కళ్యాణ్ నగర్‌లోని ఊర్వశి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ గుప్తా, సరిత రాణిల వివాహం 2013 లో జరిగింది. మొదటి నుంచి వీరిరువురికి తరచు గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. కుల పెద్దలు సర్ది చెప్పినా ప్రవీణ్ గుప్తా మారటం లేదని, ఇదే క్రమంలో వీరి గొడవలు ఆదివారం తార స్థాయికి చేరాయి. దీపావళి కావడంతో పూజ చేస్తున్న సరితపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి, గొంతు కోసి హతమార్చాడు. ప్రవీణ్ గుప్తా తన మూడు సంవత్సరాల కుమారున్ని తనకు అప్పచెప్పి.. భార్యను చంపేశాను, పోలీసులకు లొంగి పోతున్నానని వెళ్లిపోయాడని హతుని వదిన తెలిపారు. ఏమి జరిగిందో తెలియక అమాయకంగా చూస్తున్న మృతురాలి బాబుని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు . సంఘటన స్థలానికి 1వ టౌన్ సి .ఐ .వెంకటేశ్వర్లు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి భవిష్యత్
అయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణం ‘సాక్షి’తో సింగరేణి ప్రాజెక్ట్సు, ప్లానింగ్ డైరెక్టర్ ఎ.మనోహర్‌రావు గోదావరిఖని : ‘సింగరేణి సంస్థ 1970లో ఎదుక్కొన్న క్లిష్టపరిస్థితి నేడు అనుభవిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా అయిల్ ధరలు తగ్గడం మూలంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చాలా సులువైంది. తక్కువ ధరకు నాణ్యమైన విదేశీ బొగ్గు లభిస్తుండడంతో దేశంలోని వినియోగదారులు ఆ బొగ్గు వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివలన సింగరేణితోపాటు దేశంలోని ఇతర బొగ్గు సంస్థలు కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు ఇచ్చినప్పుడే సింగరేణి భవిష్యత్ ఉంటుంది’ అని సంస్థ ప్రాజెక్ట్సు, ప్లానింగ్ డైరెక్టర్ ఎ.మనోహర్‌రావు స్పష్టం అన్నారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వివరాలు ఆయన మాటలో.. బొగ్గు వాడకంపై దుష్ప్రచారం... వివిధ వస్తుత్పత్తి సంస్థలలో శక్తిని ఉత్పన్నం చేసేందుకు బొగ్గుతోపాటు అయిల్ను వాడుతుంటారు. అయితే ఇన్నాళ్లుగా బొగ్గు ఆధారిత పరిశ్రమల్లో సింగరేణి బొగ్గును విరివిగా ఉపయోగించారు. కానీ అయిల్ ధరలు తగ్గించడంతో ఆయా కంపెనీలు బొగ్గును కాకుండా అయిల్‌నే వినియోగించడం మొదలు పెట్టాయి. బొగ్గు వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని ఆయిల్ కంపెనీలు దుష్ప్రచారం చేశాయి. దీనికితోడు విదేశాల నుంచి కూడా తక్కువ ధరకు బొగ్గు లభ్యమవడంతో కొన్ని కంపెనీలు ఆ బొగ్గునే వాడుతున్నాయి. 1970లో ఇలాంటి పరిస్థితి ఏర్పడగా...సింగరేణి ఆనాడు ఇబ్బందులను ఎదుర్కొన్నది. మళ్లీ 45 ఏళ్ల తర్వాత సింగరేణిలో అదే పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యుత్‌ను అతి చౌకగా ఉత్పత్తి చేసేందుకు బొగ్గు ప్రధాన వనరుగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి తాత్కాలికంగానే ఉండనున్నది. కానీ దీనిని తట్టుకోవడానికి వీలుగా, ప్రస్తుత సంక్షోభం గురించి కార్మికులు, అధికారులకు వివరించి నాణ్యమైన బొగ్గును వెలికితీసేలా వారిని సన్నద్ధం చేస్తున్నాం. అందుకే మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. కంటిన్యూయస్, లాంగ్వాల్ విధానంతోనే బొగ్గు ఉత్పత్తి... ప్రస్తుతం సింగరేణిలో ఉన్న భూగర్భ గనుల్లో ఒకటి, రెండు గనులు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న కొన్ని గనులతోపాటు రాబోయే కొత్త గనుల్లో కంటిన్యూయస్ మైనర్, లాంగ్వాల్ విధానంతోనే బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ రెండు విధానాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న శాంతిగని, పీవీకే గని, కేటీకే–6, కొత్తగూడెం రాంపూర్ గనుల్లో కంటిన్యూయస్ మైనర్ విధానం, ఆర్కే–7, కేటీకే–5, కెటికె–3 గనుల్లో లాంగ్వాల్ యంత్రాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక మిగిలిన గనులన్నింటిని కాలనుక్రమంగా మూసివేస్తాం. కొత్త ప్రాజెక్టులివే... కేటీకే ఓపెన్‌కాస్ట్‌కు పర్యావరణ అనుమతులు లభించినందున త్వరలోనే ఈ ఓసీపీని ప్రారంభించనున్నాం. అలాగే కేకే–6 గని, కిష్టారం ఓసీపీ, జేవీఆర్ ఓసీ–2, కేఓసీ–3 (ఇల్లందు)కు అనుమతులు రానున్నాయి. ఇవి వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. రామగుండం రీజియన్‌లోని జీడీకే–5వ గనిని మూసివేసి 5ఏ గనికి కలుపుకుని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుతోపాటు వకీల్‌పల్లి ఓసీపీని మూడేళ్లలో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఐదు నుంచి పదేళ్లలో జీడీకే–11వ గని కూడా ఓసీపీగా మారే అవకాశాలున్నాయి. భూగర్భ గనుల్లో కంటిన్యూయస్ మైనర్, లాంగ్వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి చేయడం, ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా బొగ్గు వెలికితీస్తేనే సింగరేణి కంపెనీ బతకగలుగుతుంది. ఇందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులు జీవనం సాగించగలగుతారు. వారం రోజుల్లోగా సీఎల్సీకి ఎన్నికల వివరాలు... సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన వివరాలను యాజమాన్యం తరఫున వారం రోజుల్లో ఢిల్లీలోని సెంట్రల్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ)కు అందజేస్తాం. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య, బూతుల సంఖ్య, ఎక్కడెక్కడ ఓట్లు వేయనున్నారనే తదితర వివరాలను అందజేస్తాం. అక్టోబర్ రెండవ వారంలో ఎన్నికలు నిర్వహించేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. -
సక్సెస్‌కు నిలువెత్తు నిదర్శనం
పట్టుదలతో జిల్లాలోనే అధిక విద్యార్థులున్న పాఠశాలగా మార్పు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ఎందరికో ఆదర్శంగా నిలిచిన హెచ్ఎం రాంనిర్మలాదేవి బయోడేటా ––––––––––––––––– పేరు : ఎం.రాంనిర్మలాదేవి చదువు : ఎంఏ, బీఈడీ స్వ గ్రామం : హుజూరాబాద్ భర్త : చంద్రంరాజు, ప్రైవేటు కంపెనీలో మేనేజర్ పిల్లలు : ముగ్గురు అమ్మాయిలు, ఒకరు వికలాంగులు ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృతి.. ఉపాధ్యాయ వృతే.. ఇందులో ఉన్న సంతృప్తి మరే వృత్తిలోనూ ఉండదు. ఈ సంతృప్తికోసం ఓ ఉపాధ్యాయురాలు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ‘వచ్చామా.. చదువు చెప్పామా.. వేళ్లామా’ అని కాకుండా నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు గోదావరిఖని గాంధీపార్క్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాంనిర్మలాదేవి. ఆమెలోని వృత్తి నిబద్ధత ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తోంది. – గోదావరిఖనిటౌన్ గాంధీపార్కు ప్రభుత్వ మండల పరిషత్ తెలుగు మీడియం పాఠశాలను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. కొన్నిరోజులుగా ప్రయివేట్ ఆంగ్లమాధ్య పాఠశాలల ధాటికి ఈ పాఠశాలకు ఆదరణ కరువైంది. కనీస విద్యార్థులు రాలేని స్థితి నెలకొంది. పాఠశాల ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో బడిని బతికించుకోవాలన్న దృఢ సంకల్పంతో రాంన్మిళాదేవి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా, డివిజన్, మండల విద్యా అధికారులకు వినతిపత్రం అందించి, తెలుగు మీడియం పాఠశాలను ఆంగ్ల మాద్యమ పాఠశాలగా నిర్వహించేందుకు అనుమతి కావాలని కోరారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అనుమతి వచ్చింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల మన్ననలు పొందుతూ ప్రయివేటుకు ఏమాత్రం తీసిపోని విధంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఈ అంశాలే పాఠశాల రాంనిర్మలాదేవిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు వచ్చేందుకు కారణాలు అయ్యాయి. ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చాయి. నాడు 50 మంది.. నేడు 450 మంది... 2000 సంవత్సరంలో ప్రారంభమైన పాఠశాలలో గతంలో 50 మంది కన్నా తక్కువగా ఉండేవారు. ప్రధానోపాధ్యాయులు రాంనిర్మలాదేవి, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక చొరవతో ప్రస్తుతం 450 మందిపైగా విద్యార్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా నిత్యం విద్యార్థులపై చూపిస్తున్న శ్రద్ధ, ఇతర బోధన అంశాలు పోషకులను, విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనే అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందింది. సొంత ఖర్చులతో... ఎలాగైనా పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేందుకు చొరవ తీసుకోవాలనుకున్నారు. తలా కొంత డబ్బులు సమకూర్చుకుని మొదటగా విద్యా సంవత్సరంలో చేపట్టనున్న ప్రత్యేకతలపై ప్రచారం చేశారు. టీవీల్లో యాడ్ వేయించారు. అనుకున్నట్టుగా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్‌లు, ఆట వస్తువులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కంప్యూటర్, భోజనం కోసం తినేందుకు ప్లేట్లు, ఫ్యాన్లు ఇతర వస్తువులను కొనుగోలు చేసి పూర్తి సౌకర్యాలతో విద్యను అందిస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలివీ.. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9.30 నుంచి 4 గంటల వరకు నడుపుతారు. అయితే ఇక్కడ ఈ పాఠశాల మాత్రం సాయంత్రం 5.30 వరకు నడుపుతున్నారు. ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్, క్రీడలు, నృత్యం, రీడింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రధానోపాధ్యాయులితోపాటు ఉపాధ్యాయులు ప్రతీనెల కొంత డబ్బులు జమ చేస్తున్నారు. ప్రత్యేక చొరవతో ఆదరణ.. – రాంనిర్మలాదేవి, ప్రధానోపాధ్యాయులు చిన్ననాటి నుంచి విద్యాబోధన అంటే నాకు ఇష్టం. అనుకున్నట్లుగానే టీచర్ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నా. నా సర్వీసులో ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రత్యేక గుర్తింపు నాకు దక్కింది. గురుదేవోభవ అన్న పదం రోజూ గుర్తు చేసుకుని, వృత్తిలో నిత్యం కొత్తగా ముందుకు సాగుతా. గాంధీపార్క్ పాఠశాల విద్యార్థుల కోసం ఇక్కడి ఉపాధ్యాయులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే ఆదరణ పొందుతున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగింది. చాల సంతోషంగా ఉంది. మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దిక్కిందనుకుంటున్నాం. జిల్లా అధికారులు గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. -
నేడు ఉత్తర తెలంగాణ ఆర్యవైశ్య సమ్మేళనం
హాజరుకానున్న తమిళనాడు గవర్నర్ రోశయ్య గోదావరిఖని : ఉత్తర తెలంగాణ జిల్లాల ఆర్యవైశ్యుల ప్రాంతీయ సదస్సు గోదావరిఖనిలో బుధవారం జరుగనుంది. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 10 గంటలకు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆయనకు ఆర్యవైశ్య ప్రముఖులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం ఎన్టీపీసీ వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 11.30 గంటల సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారం పరిధిలోని పాత ఎస్బీహెచ్ బ్యాంకు సమీపంలో హరితహారంలో భాగంగా మొక్కను నాటుతారు. అక్కడి నుంచి గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మహాత్మాగాంధీ విగ్రహం, అడ్డగుంటపల్లి తీన్రస్తాలో రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని రోశయ్య ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సింగరేణి ఆర్జీ–1 కమ్యూనిటీహాల్లో జరగనున్న ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొని ఆర్యవైశ్యులనుద్దేశించి మాట్లాడుతారు. రోశయ్యతోపాటు పలువురు మంత్రులు, ఆర్టీసీ చైర్మన్, నగర మేయర్, ఇతర వైశ్య ప్రముఖులు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గోదావరిఖనిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న సదస్సుకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి సుమారు ఐదు వేల మంది వరకు ఆర్యవైశ్యులు హాజరవుతారని సదస్సు కన్వీనర్ కోలేటి దామోదర్ తెలిపారు. ఆర్యవైశ్యులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, నిరుపేదలైన ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. ====================================== రోశయ్య పర్యటనకు భారీ బందోబస్తు – ఇన్చార్జిగా జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కోల్‌సిటీ : గోదావరిఖనిలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం పర్యటించనుండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ పుష్కరాల బందోబస్తులో ఉన్నారు. దీంతో జగిత్యాల డీఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ గోదావరిఖని ఇన్చార్జి డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. గోదావరిఖని, రామగుండం, ఎఫ్‌సీఐ, ఎన్టీసీపీలో డీఎస్పీ బుధవారం పర్యటించారు. బందోబస్తును పరిశీలించారు. ఎఫ్‌సీఐ, అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌కలాం విగ్రహం ఆవిష్కరణ ప్రాంతం, ఆర్యవైశ్య భవన్, సింగరేణి కమ్యూనిటీ హాల్, రామగుండం రైల్వే స్టేషన్, ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌ను రామగుండం సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ దేవారెడ్డితో కలిసి డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ప్రయోగాత్మక కాన్వాయ్‌ని డీఎస్పీ స్వయంగా ప్రారంభించి పోలీసుల అప్రమత్తతను పరిశీలించారు. అతనంతరం బందోస్తు ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. నలుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 160 మంది పోలీసులు రెండు మొబైల్పార్టీలు, రూఫ్పార్టీ, కాన్వాయ్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారని తెలిపారు. మార్కండేయకాలనీలోని ఆర్యవైశ్య సమ్మేళన కమిటీ కన్వీనర్ కోలేటి దామోదర్ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారని తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఎల్బీనగర్ కాలనీకి చెందిన మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కాలనీకి చెందిన దాసరి పద్మ(38) గురువారం మధ్యాహ్నం ఇంట్లో అచేతనంగా పడి ఉంది. ఇది గమనించిన వారు పరిశీలించి చూడగా ఆమె మృతిచెంది ఉంది. ఎలా మరణించిందనే విషయం తెలియరాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య
కరీంనగర్: ప్రేమించిన వాడు మొఖం చాటేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని కావేటి సరిత(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.గోదావరిఖని అంబేద్కర్నగర్కి చెందిన సరిత తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి గాజుల వ్యాపారం చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటుంది. సరిత హైదరాబాద్‌లో ఉంటూ ఇంజనీరింగ్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ సమయంలోనే అదిలాబాద్‌కు చెందిన రాములుతో ప్రేమలో పడింది. పెళ్లి ప్రస్థావన వచ్చేసరికి అతను విముఖత చూపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు వివరాలను సరిత త ల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.