
సాక్షి, గోదావరిఖని : ఆల్‌ఫ్రీ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది ఓ ముఠా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ చేస్తామని ఎలాంటి రోగాన్ని అయినా నయం చేస్తామంటూ ప్రజలను నమ్మబలికించారు. కానీ థెరపీకి కావాల్సిన కిట్స్ కొంటే ఇంటికే వచ్చి థెరపీ చేస్తామన్నారు. ఆశపడి ప్రజలు రూ.20 వేల నుంచి 60 వేలు చొప్పున ఆడ్వాన్సులు చెల్లించి చికిత్సకు కావాల్సిన వస్తువులను కొన్నారు. థెరపీకి అవసరమైన మ్యాట్, స్టీమ్, స్టోన్స్‌లను భారీ ధరలకు విక్రయించి ప్రజలకు టోకరా ఇచ్చారు.
థెరపీ ఉచితమేకదా అని ప్రజలకు కిట్స్‌ను కొన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఆ సెంటర్ మూసి ఉండటంతోపాటూ ప్రచార బోర్డు తొలగించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ. 60 లక్షలు కాజేసి బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది.