గోదావరిఖని (రామగుండం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టిసారించింది. తాజాగా శనివారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మరో 81 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 90 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభ దశలో ఉన్నా యి. మరో 81 మెగావాట్ల సోలార్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
సంస్థ పరిధిలోని 1,500 ఎకరాల్లో మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం రూ.1, 350 కోట్లు ఖర్చు చేయాలని బోర్డు నిర్ణ యించింది. ఒక మెగావాట్ విద్యుత్ కోసం రూ.4.28 కోట్ల బడ్జెట్, నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించి ప్లాంట్లు ఏర్పా టు చేస్తోంది. మణుగూరులో 30 మెగావా ట్లు, జైపూర్ థర్మల్ ప్లాంట్ ఆవరణలో 10 మెగావాట్లు, ఆర్జీ–3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లెందులో 39 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల పనులు జరుగుతున్నా యి. వీటిని భారత్‌హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ నిర్మి స్తోంది. మణుగూరు ఏరియాలో నిర్మించిన 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో నిర్మించిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి.
రెండోదశ కేంద్రాలు వేగవంతం
రెండోదశలో నిర్మాణం 90 మెగావాట్ల సో లార్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిలో 10 మెగావాట్లు భూపాలపల్లి, 43 మెగావాట్లు మందమర్రి, 37 మెగావాట్ల ప్లాంట్‌ను కొత్తగూడెంలో ఏర్పా టు చేయనున్నారు. వీటిని అదానీ సంస్థ నిర్మిస్తోంది.
మూడో దశలో 81 మెగావాట్లు..
మూడో దశలో 81 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 32 మెగావాట్లు ఓసీపీ డంప్‌యార్డులపై, 15 మెగావాట్లు సింగరే ణి ప్రాంతంలోని జలాశయాలపై, 34 మెగా వాట్ల ప్లాంట్లు సంస్థలోని స్థలాల్లో నిర్మించనున్నారు.
జలాశయాలపై 500 మెగావాట్లు..
రాష్ట్రంలో ఉన్న భారీ జలాశయాలపై మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజ మాన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలసి సంస్థ నివేదిక రూపొందించింది. త్వరలో దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment