అక్కడి ఉన్నతాధికారులను కలిసిన సీఎండీ ఎన్.బలరాం
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు.
అనంతరం రాజస్తాన్ జెన్‌కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు.
సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment