కట్టుకున్న భర్తే కాలయముడై అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం జరిగింది. వివరాలు కళ్యాణ్ నగర్లోని ఊర్వశి థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ గుప్తా, సరిత రాణిల వివాహం 2013 లో జరిగింది. మొదటి నుంచి వీరిరువురికి తరచు గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. కుల పెద్దలు సర్ది చెప్పినా ప్రవీణ్ గుప్తా మారటం లేదని, ఇదే క్రమంలో వీరి గొడవలు ఆదివారం తార స్థాయికి చేరాయి. దీపావళి కావడంతో పూజ చేస్తున్న సరితపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి, గొంతు కోసి హతమార్చాడు.