ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఆసుపత్రి భవనం డాబాపై కుళ్లిన స్థితో శవాల గుట్టలు కనిపించాయి. ప్రస్తుతం ఈ సంఘటన పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత దయనీయంగా, కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాటిని గద్దలు, ఇతర పక్షుల ఆహారం కోసం భవనంపై పడేశారనే వార్తలు సైతం వ్యాప్తి చెందాయి.
ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రిని కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారి ఒకరు సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రి మార్చురీ పైభాగంలో ఈ మృతదేహాలను గుర్తించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భవనంపై వందల కొద్ది మృతదేహాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. నిష్తార్ ఆసుపత్రి సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి చౌధరీ జమాన్ గుజ్జార్ సలహాదారు ఆసుపత్రిని సందర్శించారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఘటనలో బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. అలాగే.. ముజామిల్ బాషిర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది పాక్. మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో స్పందించారు నిష్తార్ వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ మరియం అషార్ఫ్. ‘పోలీసు విభాగం గుర్తు తెలియని మృతదేహాలను విశ్వవిద్యాలయానికి అప్పగించింది. విద్యార్థులు వైద్యపరమైన పరీక్షలు నిర్వహించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వైద్య పరంగా ఉపయోగించేందుకు ఎముకలు, పుర్రెను వేరు చేయటం నిబంధనలకు విరుద్ధమేమీ కాదు.’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి: వీడియో: శభాష్.. ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది
Comments
Please login to add a commentAdd a comment