Dead bodies identified
-
షాకింగ్ ఘటన.. హాస్పిటల్ భవనంపై శవాల గుట్టలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఆసుపత్రి భవనం డాబాపై కుళ్లిన స్థితో శవాల గుట్టలు కనిపించాయి. ప్రస్తుతం ఈ సంఘటన పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత దయనీయంగా, కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాటిని గద్దలు, ఇతర పక్షుల ఆహారం కోసం భవనంపై పడేశారనే వార్తలు సైతం వ్యాప్తి చెందాయి. ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రిని కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారి ఒకరు సందర్శించారు. ఆ సమయంలో ఆస్పత్రి మార్చురీ పైభాగంలో ఈ మృతదేహాలను గుర్తించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భవనంపై వందల కొద్ది మృతదేహాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. నిష్తార్ ఆసుపత్రి సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి చౌధరీ జమాన్ గుజ్జార్ సలహాదారు ఆసుపత్రిని సందర్శించారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఘటనలో బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. అలాగే.. ముజామిల్ బాషిర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది పాక్. మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో స్పందించారు నిష్తార్ వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ మరియం అషార్ఫ్. ‘పోలీసు విభాగం గుర్తు తెలియని మృతదేహాలను విశ్వవిద్యాలయానికి అప్పగించింది. విద్యార్థులు వైద్యపరమైన పరీక్షలు నిర్వహించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వైద్య పరంగా ఉపయోగించేందుకు ఎముకలు, పుర్రెను వేరు చేయటం నిబంధనలకు విరుద్ధమేమీ కాదు.’ అని వెల్లడించారు. ఇదీ చదవండి: వీడియో: శభాష్.. ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది -
ఉక్రెయిన్‌లో శవాల దిబ్బలు
ఇజియం (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు గుర్తించాయి. కొన్నింటిపై తూటాల గాయాలుండగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల్లో మరణించి ఉంటారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలకు చెవులు కోసేసి ఉండటంతో రష్యా సైనికులు చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి సమీపంలోనే మరో చోట 17 ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను కొనుగొన్నారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ..బుచా, మరియుపోల్, ఇజియం..రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసింది. ఇందుకు ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. ఇలా ఉండగా, రష్యాను సైనికపరంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరో 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించింది. -
Russia-Ukraine War: సామాన్యులే సమిధలు
కీవ్/బుచా: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా సైన్యం క్రమంగా వెనక్కి మళ్లుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు కదులుతోంది. డాన్‌బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ రష్యా నియంత్రణలో ఉన్న కీవ్ పరిసర పట్టణాలను ఉక్రెయిన్ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. బుచాతోసహా పలు పట్టణాల్లో రష్యా జవాన్లు దారుణ అకృత్యాలకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. సామాన్య పౌరులపై రాక్షసకాండ జరిపారని, వందలాది మందిని బలితీసుకున్నారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరైనా వెనెడిక్టోవా చెప్పారు. కీవ్ ఇరుగుపొరుగు పట్టణాల్లో గత మూడు రోజుల్లో 410 మృతదేహాలు గుర్తించామని తెలిపారు. ఇందులో 140 మృతదేహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కీవ్ రీజియన్‌లోని మోటిజైన్ మేయర్ ఓల్గా సుఖెంకోను, ఆమె భర్త, కుమారుడిని రష్యా సైనికులు హత్య చేశారని, శవాలను ఓ కుంటలోకి విసిరేశారని ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి వెరెస్చుక్ చెప్పారు. మేయర్, ఆమె కుటుంబ సభ్యులను మార్చి 23న రష్యా జవాన్లు కిడ్నాప్ చేశారని వెల్లడించారు. 11 మంది మేయర్లు, కమ్యూనిటీ పెద్దలను కూడా అపహరించారని తెలిపారు. చెర్నిహివ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. చెర్నిహివ్–కీవ్ రహదారిపై సోమవారం నుంచి రాకపోకలు పునరుద్ధరించామని పేర్కొంది. రష్యా దాడుల్లో చెర్నిహివ్ నగరం 80 శాతం ధ్వంసమయ్యిందని స్థానిక మేయర్ వెల్లడించారు. కీవ్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని బలాక్లియాలోని ఓ ఆస్పత్రి రష్యా దాడిలో ధ్వంసమయ్యింది. అందులోని రోగులను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రష్యా మళ్లీ దాడి చేయగా ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడని ఖర్కీవ్ గవర్నర్ చెప్పారు. ఆదివారం రాత్రి ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ఆగ్రహం ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా మారణకాండను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ట్విట్టర్లో ఖండించారు. సాధారణ పౌరులను చంపడం కచ్చితంగా యుద్ధ నేరమేనన్నారు. రష్యా రాక్షసకాండను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్, ఎస్తోనియా ప్రధానమంత్రి కజా కల్లాస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. బుచాలో మారణకాండకు నిరసనగా జర్మనీ 40 మంది రష్యా దౌత్యాధికారులను దేశం నుంచి బహిష్కరించింది. విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందే: బైడెన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా విచారణను ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని సోమవారం ప్రకటించారు. నిజానిజాలు నిగ్గుతేల్చాలి: లావ్రోవ్ ఉక్రెయిన్‌లో తమ దళాలు ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి భద్రతా మండలిని సమావేశపర్చాలన్నారు. ఇంతటి దారుణాలు చూశాక చర్చలు కష్టమే రష్యా సైన్యం అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బుచా సిటీలో అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు. ‘ కుప్పలు తెప్పలుగా పడిన అమాయకుల మృతదేహాలను చూశాక రష్యాతో చర్చలు జరపాలనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. అందరినీ దా రుణంగా హింసించి చంపారు. చిన్నారులు, మైనర్లుసహా మహిళలను రేప్ చేశారు. జంతువులకంటే హీనంగా ఉక్రెయిన్లను రష్యా సైనికులు పరిగణించారు’ అని జెలెన్స్కీ భావోద్వేగంతో మాట్లాడారు. -
గోదావరిలో లభ్యమైన నాలుగు మృతదేహాలు
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరి రేవులో నాలుగు మృతదేహాలు లభించటం స్థానికంగా కలకలం రేపింది. కొవ్వూరు లాంచీల రేవులో మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ, నాలుగేళ్ల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందారా? ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేదేమైన కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్టానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సిఉంది. -
రైలు ప్రమాద మృతుల వివరాలు
విజయనగరం : హిరాఖండ్ రైలు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 41మంది మృతి చెందినట్లు అడిషినల్ డివిజినల్ రైల్వే మేనేజర్ అజయ్ అరోరా అధికారికంగా ప్రకటించారు. వారిలో 18 మంది మృతదేహాలను గుర్తించామన్నారు. రైలు ప్రమాదంపై విచారణ కమిటీ వేశామని అజయ్ అరోరా చెప్పారు. మృతుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందిన వారు ఉన్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. మృతుల వివరాలు పేరు వయస్సు రిజర్వేషన్ సీట్ నెంబర్ 1. ఎం కృష్ణ 35 డి4 2. పి.శ్రీను 25 డి6 3. బి.కమల 50 డి13 4. గాయత్రి సాహు 14 డి17 5. దిలీప కెఆర్ రౌత్ 51 డి8 6. టీకే మైంజ్ 45 డి16 7. సోము అన్నమ్మ డి18 8. విష్ణు ప్రసాద్ సాహు డి19 9. రాజన్ నాయక్ 18 డి3 10. సుభాష్ సీహెచ్ సాహు 60 డి9 11. ఎస్.రేణుకా డి15 12. పి.పోలి 35 డి21 13. జసోదా పండిట్ డి22 14. రామ్ ప్రసాద్ పండిట్ డి23 15. కె.రేవతి 16 డి24 16. మండోల్ బలరామ్ డి25 17. సుభా భారతి సాహు డి12 18. తపన్ కుమార్ ప్రధాన్ 26 డి26 -
మరో 15 మృతదేహాల గుర్తింపు
మొత్తం 34 మృతదేహాలను గుర్తించిన అధికారులు 28 మృతదేహాల అప్పగింత నేడు మరో 8 మృతదేహాల నివేదికలు అందే అవకాశం హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్‌జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవ దహనమైన మృతదేహాల తాలూకు రెండో జాబితాను అధికారులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. డీఎన్ఏ నివేదికల ఆధారంగా మరో 15 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులకు మంగళవారం సాయంత్రం వరకూ 13 మృతదేహాలను అప్పగించగా.. సాయంత్రం ప్రకటించిన రెండో జాబితాలోని 6 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 3 మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి జాబితాలోని మరో మూడు మృతదేహాల సంబంధీకులు మంగళవారం మంచి రోజు కానందున (సెంటిమెంటు) బుధవారం తీసుకెళ్లనున్నారు. అంతకుముందు సోమవారం 3 మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. దీంతో ఇప్పటిదాకా 28 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్లైంది. మరో ఆరు మృతదేహాలను బుధవారం అప్పగించనున్నారు. ఇప్పటిదాకా మొత్తం 34 మృతదేహాల డీఎన్ఏ నివేదికలు అందగా మిగతా 8 మృతదేహాల నివేదికలు బుధవారం సాయంత్రంలోపు అందే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండో జాబితాలో గుర్తించింది వీరినే.. 1.ఎన్.ఎస్. గిరిధర్(62), 2.జి.వాసంతి(60), 3. శక్తికాంత్ రౌత్(28), 4. కె.రమ్య(26), 5. కె.రిదియ(30 నెలలు), 6. హరీష్ భగాయత్ (31), 7.చంద్రశేఖర్(28), 8. సురేష్ బాబు (26), 9. సాఖీబ్ అహ్మద్(27), 10.హసీబ్ అహ్మద్(24), 11.మహ్మద్‌ఆసీఫ్ (25), 12. ఫారూక్‌అలీ(24), 13.జబీన్ తాజ్(26), 14.ఉజ్మాసుల్తానా(6), 15.అజ్మతుల్లా (35). దర్యాప్తునకు ఆదేశించండి: హైకోర్టులో పిల్ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించి, దానిని పర్యవేక్షించాలని హైకోర్టును అభ్యర్థిస్తూ హైకోర్టు న్యాయవాది ఎస్.రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కేంద్ర రవాణాశాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై, దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
ఓల్వో బస్సు ప్రమాదంలో 20 మృతదేహాల గుర్తింపు
హైదరాబాద్: ఓల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందినవారిలో 20 మందిని అధికారులు గుర్తించారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారులో గత నెల 31నఓల్వో బస్సు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు.