రైలు ప్రమాద మృతుల వివరాలు
విజయనగరం : హిరాఖండ్ రైలు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 41మంది మృతి చెందినట్లు అడిషినల్ డివిజినల్ రైల్వే మేనేజర్ అజయ్ అరోరా అధికారికంగా ప్రకటించారు. వారిలో 18 మంది మృతదేహాలను గుర్తించామన్నారు.
రైలు ప్రమాదంపై విచారణ కమిటీ వేశామని అజయ్ అరోరా చెప్పారు. మృతుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందిన వారు ఉన్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు.
మృతుల వివరాలు
పేరు వయస్సు రిజర్వేషన్ సీట్ నెంబర్
1. ఎం కృష్ణ 35 డి4
2. పి.శ్రీను 25 డి6
3. బి.కమల 50 డి13
4. గాయత్రి సాహు 14 డి17
5. దిలీప కెఆర్ రౌత్ 51 డి8
6. టీకే మైంజ్ 45 డి16
7. సోము అన్నమ్మ డి18
8. విష్ణు ప్రసాద్ సాహు డి19
9. రాజన్ నాయక్ 18 డి3
10. సుభాష్ సీహెచ్ సాహు 60 డి9
11. ఎస్.రేణుకా డి15
12. పి.పోలి 35 డి21
13. జసోదా పండిట్ డి22
14. రామ్ ప్రసాద్ పండిట్ డి23
15. కె.రేవతి 16 డి24
16. మండోల్ బలరామ్ డి25
17. సుభా భారతి సాహు డి12
18. తపన్ కుమార్ ప్రధాన్ 26 డి26