Hirakhand train accident
-
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డుమార్గం ద్వారా విజయనగరానికి బయల్దేరారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాదం జరిగిన కూనేరు ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తారు. క్షతగ్రాతులతో పాటు ప్రమాద ఘటనలో మరణించిన పాత్రబిల్లి శ్రీను, పోలిశెట్టి, మిరియాల కృష్ణ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. -
రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను సోమవారం(రేపు) ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రైలు ప్రమాదం గురించి తెలియగానే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. -
రైలు ప్రమాద మృతుల వివరాలు
విజయనగరం : హిరాఖండ్ రైలు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 41మంది మృతి చెందినట్లు అడిషినల్ డివిజినల్ రైల్వే మేనేజర్ అజయ్ అరోరా అధికారికంగా ప్రకటించారు. వారిలో 18 మంది మృతదేహాలను గుర్తించామన్నారు. రైలు ప్రమాదంపై విచారణ కమిటీ వేశామని అజయ్ అరోరా చెప్పారు. మృతుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందిన వారు ఉన్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. మృతుల వివరాలు పేరు వయస్సు రిజర్వేషన్ సీట్ నెంబర్ 1. ఎం కృష్ణ 35 డి4 2. పి.శ్రీను 25 డి6 3. బి.కమల 50 డి13 4. గాయత్రి సాహు 14 డి17 5. దిలీప కెఆర్ రౌత్ 51 డి8 6. టీకే మైంజ్ 45 డి16 7. సోము అన్నమ్మ డి18 8. విష్ణు ప్రసాద్ సాహు డి19 9. రాజన్ నాయక్ 18 డి3 10. సుభాష్ సీహెచ్ సాహు 60 డి9 11. ఎస్.రేణుకా డి15 12. పి.పోలి 35 డి21 13. జసోదా పండిట్ డి22 14. రామ్ ప్రసాద్ పండిట్ డి23 15. కె.రేవతి 16 డి24 16. మండోల్ బలరామ్ డి25 17. సుభా భారతి సాహు డి12 18. తపన్ కుమార్ ప్రధాన్ 26 డి26 -
రైలు ప్రమాదంపై చంద్రలేఖ ముకర్జీ ఆరా
-
రైలు ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
-
రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
రైలు ప్రమాదంపై సురేష్ ప్రభు ఆరా
విజయనగరం : హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సహాయకచర్యలు ముమ్మరం చేయాలని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లకు బాబు ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడామని.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. పార్వతీపురం నుంచి 30, విజయనగరం నుంచి 7 వైద్య బృందాలతో సహా మొత్తం 37 వైద్య బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు. విశాఖ కేజీహెచ్‌లో క్షతగాత్రులకు జాప్యం లేకుండా వైద్యం అందిస్తున్నామని కామినేని చెప్పారు. -
రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్ : విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. Shocked at the tragic Hirakhand Express derailing. Heartfelt condolences to the bereaved families. Praying for speedy recovery of injured. — YS Jagan Mohan Reddy (@ysjagan) 22 January 2017