రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy to Visit traian Accident site in Vizianagaram | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

Published Sun, Jan 22 2017 4:06 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ - Sakshi

రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను సోమవారం(రేపు) ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రైలు ప్రమాదం గురించి తెలియగానే వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement