
సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరి రేవులో నాలుగు మృతదేహాలు లభించటం స్థానికంగా కలకలం రేపింది. కొవ్వూరు లాంచీల రేవులో మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ, నాలుగేళ్ల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీరందరూ ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందారా? ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేదేమైన కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్టానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment