ఓల్వో బస్సు ప్రమాదంలో 20 మృతదేహాల గుర్తింపు
హైదరాబాద్: ఓల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందినవారిలో 20 మందిని అధికారులు గుర్తించారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారులో గత నెల 31నఓల్వో బస్సు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు.