కాన్పు చేయబోమని చెప్పడంతో ఆసుపత్రి ఆవరణలోనే నిరీక్షిస్తున్న గర్భిణి మూగెమ్మ బంధువులు(ఇన్‌సెట్) మూగెమ్మ
నూనెపల్లె: పేరుకు జిల్లాస్థాయి ఆస్పత్రి. అయినా కాన్పు కోసం గర్భిణీని కాదన్నారు.. కారణమడిగితే రక్తం తక్కువగా ఉందంటూ సాకు చెప్పారు. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నిండు గర్భిణీని సొంత ఖర్చులతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటన గురువారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. వెలుగోడు పరిధిలోని గూడెం ప్రాంతానికి చెందిన మూగెమ్మకు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబీకులు గురువారం నంద్యాల జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం రాగానే వైద్యులు పరీక్షలు చేయగా రక్తం (5.2 గ్రాములు) తక్కువగా ఉందని తెలియడంతో ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. కర్నూలు వెళ్లాలని సూచించగా తాము పేదవాళ్లమని అంతదూరం వెళ్లేందుకు డబ్బులు లేవని ప్రాధేయపడుతూ సాయంత్రం 5 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె బంధువులు తెలిసిన వారి వద్ద డబ్బులు తెప్పించుకుని ఆపరేషన్ కోసం కర్నూలు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment