దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం | Man Molested Of Pregnant Woman In Karimnagar | Sakshi
Sakshi News home page

దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం

Published Tue, Dec 17 2019 1:19 AM | Last Updated on Tue, Dec 17 2019 12:00 PM

Man Molested Of Pregnant Woman In Karimnagar - Sakshi

సాక్షి, కమాన్‌చౌరస్తా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళ కుటుంబం కొన్నేళ్లుగా కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ మధ్యాహ్నం డిష్‌ రిపేర్‌ పేరిట ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ తొమ్మిది నెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది.

కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ భర్త ఇంటికి రాగానే పుస్తెలు మళ్లీ కట్టుకుంటూ, బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చి అడుగగా జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలోచించారు. చివరకు సోమవారం కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement